ఒక్క రోజులోనే 15 మందిపై దాడి
మందమర్రి మండలంలో పిచ్చి కుక్కల స్వైర విహారం
Manchiryal: మంచిర్యాల జిల్లా మందమర్రిలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నారు. కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే దాదాపు 15 మందిపై దాడి చేశాయి. మందమర్రి మండలం రామకృష్ణాపూర్ లోని జోన్ 1, జోన్ 2లో 2 పిచ్చి కుక్కలుస్వైర విహారం చేశాయి. నిన్న సాయంత్రం నుండి ఈ రోజు ఉదయం వరకు కుక్కల దాడిలో 15 మంది గాయపడ్డారు. కాలనీవాసులు మున్సిపాలిటీ సిబ్బందికి కుక్కల స్వైర విహారం గురించి ఫిర్యాదు చేశారు. అయినా ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. బయటకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి లనెకొంది. కుక్కల దాడిలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించడానికి మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు.