రేపు మంచిర్యాల జిల్లా బంద్
-రైతులకు సాగు నీరు ఇవ్వాలని డిమాండ్
-ప్రజలకు పిలుపునిచ్చిన కాంగ్రెస్ శ్రేణులు
ప్రజలు మంచిర్యాల జిల్లా బంద్ లో స్వచ్ఛందంగా పాల్గొనాలని మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పిలుపునిచ్చారు. ఆమె బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా కడెం ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టు పంట పొలాలకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రెండు రోజులుగా రైతులు ఆమరణ దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఆ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ జిల్లా బంద్కు పిలుపునిస్తున్నట్లు ప్రకటించారు. ఈ బంద్ లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కొక్కిరాల సురేఖ కోరారు.