బాసర ట్రిపుల్ ఐటీలో కుక్కల దాడి
-ఇద్దరు విద్యార్ధులకు గాయాలు
-నిన్న రాత్రి జరిగిన ఘటన
-బయటకు రాకుండా అధికారుల జాగ్రతలు
Basra IIIT: వీధి కుక్కల స్వైర విహారంతో ప్రజలు నానా ఇబ్బందులూ పడుతున్నారు. రోడ్లపై తిరిగే ప్రజలపై దాడి చేస్తున్న కుక్కలు తమ ప్రతాపాన్ని చూపుతున్నాయి. తాజాగా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల పై సైతం దాడి చేశాయి. హాస్టల్ లోపల ఇద్దరు విద్యార్ధులను కరిచి గాయపరిచాయి. దీంతో వారికి క్యాంపస్ లో చికిత్స అందించారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్తితి నిలకడగానే ఉంది. విషయం బయటకు రాకుండా అధికారుల జాగ్రతలు తీసుకుంటున్నారు.