మంత్రి పర్యటన… నేతల ముందస్తు అరెస్ట్
Manchiryal: నేడు రాష్ట్ర ఆర్ధిక, వైద్య శాఖ మంత్రి హరీష్ రావు పర్యటన నేపధ్యంలో మంచిర్యాల జిల్లాలో బీజీపీ నేతల అరెస్టులు కొనసాగుతున్నాయి. మంత్రి పర్యటన అడ్డుకుంటామని హెచ్చరికల నేపధ్యంలో వారిని పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తులా ఆంజనేయులు, యువమోర్చ ప్రధాన కార్యదర్శి అమిరిషెట్టి రాజు, బీసీ మోర్చ జిల్లా అధ్యక్షుడు అశోక్, బీజీపీ పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర రావు, ప్రధాన కార్యదర్శి బోయిని హరికృష్ణ తదితరులను పోలీస్ స్టేషన్ తరలించారు.