మంత్రాల నెపంతో వృద్ధ దంపతులపై దాడి
మంత్రాల నెపంతో వృద్ధ దంపతులపై దాడి చేసిన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. భీమిని మండలం మల్లిడి గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు పత్తిపాక పెంటయ్య (78), భార్య పుష్ప (65)పై గుర్తు తెలియని దుండగులు బుధవారం ఉదయం దాడి చేశారు. మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో దాడికి పాల్పడినట్లు సమాచారం. దుబ్బగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఆరోగ్యం సరిగ్గా ఉండటం లేదు. దీంతో దాదాపు 15 మంది వ్యక్తులు ఉదయం ఆరు గంటల ప్రాంతంలో కర్రలు, గడ్డపారలతో దాడి చేశారు. గాయలపాలైన దంపతులను మొదట బెల్లంపల్లి ఆసుపత్రికి తరలించి, అక్కడి నుంచి మంచిర్యాల ఆసుపత్రికి తీసుకువెళ్లారు.