జిల్లా కేంద్రంలో చైన్ స్నాచింగ్

Chain snatching: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఓ మహిళ మెడలో బంగారు గొలుసు దొంగతనం జరిగింది. కలెక్టర్ చౌరస్తాలో స్కూటీ పై వెళ్తున్న మడావి గంగూబాయి అనే మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కెలాడు ఓ దొంగ.
హెల్మెట్ ధరించి స్కూటీ పై వచ్చిన చైన్ స్నాచర్ మహిళను తోసేసి చైన్ లాక్కెల్లాడు. చైన్ తీసుకునే సమయంలో ఆమెని నెట్టి వేయడంతో స్వల్ప గాయాలయ్యాయి. కొందరు వ్యక్తులు దొంగను వెంబడించినా లాభం లేకుండా పోయింది. ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ లు కేస్ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ పుటేజీ పరిశీలిస్తున్న పోలీసులు దొంగ కోసం గాలిస్తున్నారు.