తోటి జవాన్ పై కాల్పులు
ముగ్గురు జవాన్లు మృతి - మరొకరి పరిస్థితి విషమం.
తెలంగాణ సరిహద్దు రాష్ట్రం లో ఉన్న చత్తీస్ ఘడ్ సుక్మా జిల్లా మారాయిగూడెం లింగం పల్లి బేస్ క్యాంప్ లో కాల్పులు కలకలం రేపింది.
జవాన్ తోటి జవాన్ల పై విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు కాల్పుల్లో ముగ్గురు జవాన్లు అక్కడిక్కడే మృతి చెందగా మరో నలుగురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి దీంతో క్షతగాత్రున్ని భద్రాచలం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.కాల్పులలో మృతి చెందిన వారు రాజమని యాదవ్,ధాంజీ,రాజీవ్ మండల్ వీరిలో రాజీవ్ మండల్ వెస్ట్ బెంగాల్ కు చెందినవాడు కాగా,మరో ఇద్దరు ,బీహార్ కి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.ఈ ఘటన ఎందుకు జరిగింది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న అధికారులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.