ఎమ్మెల్యే అమ్మాయిలను పంపుమన్నడు..
-తప్పుడు కేసులతో వేధిస్తున్నడు
-ఎమ్మెల్యేపై ఆరిజన్ డైరెక్టర్ శేజల్ ఆరోపణ
-ఆరోపణలతో ఆడియో, వీడియో టేపు విడుదల
-గిట్టని వారి పని ఇది - ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
Manchiryal: తనకు అమ్మాయిలు కావాలని వారిని పంపాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తమపై ఒత్తి డి తెచ్చారని ఆరిజిన్ డెయిరీ డైరెక్టర్ శేజల్ ఆరోపించారు. ఆమె ఈ మేరకు సోమవారం ఓ ఆడియో, వీడియో విడుదల చేశారు. బెల్లంపల్లిలో డెయిరీ ఏర్పాటు చేసేందుకు తాము ఎమ్మెల్యే కలిశామని చెప్పారు. అందులో తనకు సంబంధించిన వారికి వాటా కావాలని కోరారని అన్నారు. దానికి తాము అంగీకరించామన్నారు. అంతేకాకుండా, తన కోర్కెలు తీర్చాలని వేధించడంతో బ్రోకర్ల ద్వారా హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్ అమ్మాయిలను పంపించినట్టు వెల్లడించారు.
డెయిరీ ఏర్పాటకు సంబంధించిన విషయంలో చర్చించేందుకు ఎమ్మెల్యే వద్దకు వెళ్లిన క్రమంలో తనతో పాటు, మరో యువతి ఆయనను కలవడానికి వచ్చిందని చెప్పారు. ఎమ్మెల్యే యువతిని తనతో పంపాల్సిందిగా కోరాడు. ఇలాంటివి చేయమని చెప్పి మేము బయటకు వచ్చామన్నారు. మరొకసారి తన నివాసానికి పిలుపించుకొని నన్ను మద్యం తీసుకోమన్నారని వెల్లడించారు. తాను ఒప్పుకోక బయటకు వెళ్లిపోయానని చెప్పారు.
అడిగిన డబ్బులు ఇవ్వలేదని కక్షగట్టి తప్పుడు కేసులు పెట్టించి తమను అరెస్టు చేయించాడన్నారు. ఎమ్మెల్యే మనుషులు మమ్మల్ని వెంబడిస్తున్నారని, తమకు ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్లైన్లో ఫిర్యాదు తీసుకోవాలని పోలీసులకు చెప్పినా తీసుకోవడం లేదని. నేరుగా వచ్చి ఫిర్యాదు చేయండని అంటున్నారని. మాకు రక్షణ కల్పించాలని అందులో ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్పందిస్తూ ఆరిజిన్ డెయిరీ నిర్వాహకులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. సబ్సిడీపై గేదెల యూనిట్లు ఇస్తామని రైతుల దగ్గర రూ.3.50 లక్షల చొప్పున వసూలు చేశారని యూనిట్లు ఇవ్వకుండా రైతులను మోసగించారని అన్నారు. డెయిరీ నిర్వాహకులను పోలీసులకు పట్టిచ్చింది తానేనని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాట్సాప్ చాటింగ్‌లతో తనకు సంబంధం లేదని దుర్గం చిన్నయ్య తెలిపారు.