అభినవ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం
మంచిర్యాల – తాండూరు మండలం కత్తెర్లలో ఎనిమిది సంవత్సరాలుగా మూతపడిన ప్రభుత్వ పాఠశాలను సోమవారం ప్రారంభించారు. అక్కడ ఉన్న 20 మంది గిరిజన విద్యార్థుల భవిష్యత్ కోసం ప్రైవేటు విద్యావాలంటరీని మధ్యాహ్న భోజనం చపాతీ , గుడ్డు తో పాటు అరటి పండ్లు ఇస్తామని అభినవ సంతోష్ కుమార్ తెలిపారు. విద్యావాలంటరీ గౌరవ వేతనం కోసం ఎంపీటీసీ, బుగ్గ ఆలయం చైర్మన్ మాసాడి శ్రీదేవి, బోయపల్లి ఉప సర్పంచ్ రౌతు వెంకటేశం, ద్వారక సర్పంచ్ మాసడి శారద, బోయపల్లి ఉపాధ్యాయులు ముందుకు వచ్చారు. పాఠశాల విద్యార్థుల కోసం నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిల్స్ వారికి సంబంధించిన స్టడీ మెటీరియల్స్ అభినవ స్వచ్చంద సేవాసంస్థ ద్వారా సమకూర్చుతున్నట్లు సంతోష్ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీటీసీ, బుగ్గ ఆలయం చైర్మన్ మాసాడి శ్రీదేవి, ద్వారక సర్పంచ్ మాసడి శారద, ఐసిడిఎస్ సూపర్వైజర్ రమాదేవి, అభినవ సంతోష్ , వార్డు మెంబర్ సుమలత , విద్యావాలంటరీ బోగరపు భాను , సేవసంస్థ సభ్యులు కాసం ఆకాష్ ,లలిత , లక్ష్మణ్ , గ్రామస్తులు,వెంకటేష్ , రాజేష్ , అమృత , సంధ్య , శ్రీమతి ,సుమలత , పద్మ , చిలుకమ్మ , సంధ్య , శైలజ హజరయ్యారు. విద్యార్థులకు భోజనం అందించేందుకు రోజు వారికి ఐదు వందల ఖర్చు అవుతుందని సహాయం చేసే దాతలు ఎవరైనా ఉంటే 9440554234 తెలపాలని కోరారు.