బ్రేకింగ్.. ఏడేండ్ల బాలికపై అత్యాచారం
-చర్చిలో డ్రైవర్గా పనిచేస్తున్న కామాంధుడు
-వృద్ధుడిని చితకబాదిన స్థానికులు, పోలీసులకు అప్పగింత

Rape:ఆడుకునేందుకు వచ్చిన ఓ బాలికపై వృద్దుడు దారుణానికి ఒడిగట్టాడు. ఏడేండ్ల బాలికపై అత్యాచారం చేయడంతో ఆ బాలిక బోరున విలపిస్తూ తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ఆ వృద్ధున్ని చితకబాదిన స్థానికులు అతన్ని పోలీసులకు అప్పగించారు.
కొమురంభీం జిల్లా కాగజ్ నగర్లో చోటు చేసుకున్న ఈ అమానవీయ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కాగజ్ నగర్లోని సి.బాపు కాలనీలోని ఓ చర్చిలో రమేష్ (65) అనే వ్యక్తి సంవత్సర కాలంగా డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అక్కడే చర్చి సమీపంలో ఆడుకుంటున్న ఏడేళ్ల బాలికను లోపలికి రమ్మని పిలిచి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలికకు తీవ్రరక్తస్రావం కావడంతో ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో జరిగిన విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు వివరించింది. కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు, కాలనీ వాసులు వృద్దుడిని చితకబాదారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాలికను ఆసుపత్రికి తరలించి వృద్దుడిని అదుపులోకి తీసుకున్నారు.