ఇంటర్ ఫలితాలు విడుదల
Telangana: తెలంగాణలో ఇంటర్ ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేసారు. జిల్లాల వారీగా మొదటి సంవత్సరం ఫలితాల్లో మేడ్చల్ తొలి స్థానంలో, రంగారెడ్డి రెండో స్థానంలో నిలిచింది. రెండో ఏడాదిలో తొలి స్థానంలో 85.08 శాతంతో ములుగు, రెండో స్థానంలో కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా నిలిచాయని మంత్రి వివరించారు.
మొదటి సంవత్సరం పరీక్షలకు 2.72 లక్షల మంది 63.85 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. లక్షా 60 వేల మంది ఏ గ్రేడ్లో… 68,335 మంది బీ గ్రేడ్లో పాసయ్యారు. అమ్మాయిలు 217453 మంది 68.85 శాతం మంది, 2,15,628 మంది అబ్బాయిల ఉండగా 122485 మంది పాసవ్వగా, 56.80 శాతం మంది పాసయ్యారు. సెకండ్ ఇయర్లో 380920 మంది హాజరయ్యారు. 256 241 మంది విద్యార్ధులు పాసయ్యారు. 65.26 శాతం పాస్. అమ్మాయిలు 1,96, 580 మంది లో 1,44,385 మంది పాసమయ్యారు. 73 .46 శాతం అమ్మాయిలు పాసయ్యారు. అబ్బాయిలు 184392 మంది హాజరు కాగా, 111856 మంది పాసయ్యారు. 60.66 శాతం మంది పాసయ్యారు.
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చ్ 15 నుంచి ఏప్రిల్ 5 వరకూ జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 9.48 లక్షలమంది ఇంటర్ పరీక్షలు రాయగా ఇందులో మొదటి సంవత్సరం విద్యార్దులు 4,82,501 మంది ఉంటే, ద్వితీయ సంవత్సరం విద్యార్ధులు 4,23, 901 మంది ఉన్నారు. పరీక్ష పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ రెండవ వారానికే పూర్తయినా డీ కోడింగ్, సమీకరణ ప్రక్రియలకు ఆలస్యమైంది. 1473 మంది పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరిగినట్లు మంత్రి సబితా వెల్లడించారు. ఎంసెట్ పరీక్షల్లో ఇంటర్ వెయిటేజ్ తీసేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేసారు.