చర్చికి వచ్చే మహిళలే అతని టార్గెట్
నల్గొండలో నిత్యపెళ్ళికొడుకు - 19 మందిని మోసం వ్యక్తి
నల్గొండలో నిత్య పెళ్లికొడుకు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుని మహిళలకు బురిడీ కొట్టిస్తున్న ఓ వ్యక్తి మోసం వెలుగుచూడటం సంచలనంగా మారింది. విలియమ్స్ అనే వ్యక్తి చర్చిలో పియానో వాయిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. చర్చిక వచ్చే మహిళలను ట్రాప్ చేస్తూ వారిని లోబరుచుకుంటున్నాడు. విలియమ్స్ ఉచ్చులో సుమారు 19 మంది మహిళలు పడ్డట్లు తెలుస్తోంది. మొదటి భార్య తనూజ ఫిర్యాదుతో నిత్యపెళ్ళికొడుకి బాగోతం వెలుగులోకి వచ్చింది. పోలీసులు అతన్ని అరెస్టు చేసేందుకు వెళ్లగా మరో నాటకీయ పరిణామానికి తెర లేపాడు. గుండెపోటు వచ్చిందంటూ ఆస్పత్రిలో హైడ్రామా సృష్టించాడు. పోలీసులు ఆస్పత్రి నుంచి విలియమ్స్ ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.