నేను చనిపోతే ఆ సీఐ బాధ్యుడు
పోలీస్ స్టేషన్ ఆవరణలో యువకుడి ఆత్మహత్యాయత్నం
కేసుల పేరిట వేధిస్తున్నారని అవేదన
డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపణ
ఆత్మహత్యాయత్నం అడ్డుకున్న పోలీసులు, స్నేహితులు
Adilabad:ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఓ యువకుడు పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్యాయత్నం చేశాడు. పురుగుల మందు డబ్బా తో వచ్చిన సిందే రోహిత్ అనే యువకుడు పోలీసులు తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపిస్తూ ఆత్మహత్య చేసుకుంటానని పురుగుల మందు తాగేందుకు యత్నించాడు. దీనిని గమనించిన పోలీసులు అడ్డుకున్నారు.
తనకు ఓ అమ్మాయికి వివాహం జరిగిందని ఆ అమ్మాయి ఫోటో స్టేటస్లో పెట్టుకుంటే కేసు పెట్టారని రోహిత్ అవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికే రెండు మూడు కేసులు నమోదు చేసి రౌడీషీట్ ఓపెన్ చేస్తానని బెదిరిస్తున్నారని అన్నాడు. పైగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించాడు. అంతా సద్దుమణిగాక ఒంటిపై పెట్రోల్ పోసుకునే ప్రయత్నం చేయగా తన స్నేహితులు నీళ్లు తీసుకొచ్చి పోశారు. తనను వన్ టౌన్ సీఐ వేధిస్తున్నారని ఆ యువకుడు రోహిత్ ఆరోపించాడు. అయితే, తానేమి వేదించడం లేదని తనకు పిర్యాదు వస్తే కేసు నమోదు చేశామని సీఐ సత్యనారాయణ వెల్లడించారు.