కాంగ్రెస్ పార్టీకి రాజీనామా
Congress Party: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ నేత కుశనపెల్లి లక్ష్మణ్ ప్రకటించారు. 15 సంవత్సరాలుగా పార్టీలో ఉంటూ పార్టీ గెలుపు కోస క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పాటుపడ్డానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సైతం తనను గుర్తించి పంచాయతీ ఎన్నికలలో పోటీ చేయడానికి అవకాశం కల్పించిందని తెలిపారు. మూడుసార్లు తాండూర్ మండలంలోని కొత్తపల్లి, మాదారం గ్రామపంచాయతీ వార్డు సభ్యునిగా మూడుసార్లు విజయం సాధించానని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో నా పూర్తి సమయాన్ని పార్టీ కార్యక్రమాలకు కేటాయించ లేకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. తన రాజీనామా ఆమోదించాలని పార్టీ నేతలను కోరారు.