నాగ్పూర్ – సికింద్రాబాద్ మధ్య వందే భారత్ రైలు
Vande Bharat Train: తెలంగాణకు మరో వందేభారత్ రైలు ప్రారంభించేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది. ఈ రైలు రూట్ కూడా సిద్ధం చేసిన ఆ శాఖ పూర్తి స్థాయిలో నడిపేందుకు ప్రణాళికలు రూపొందించింది.
నాగ్పూర్ నుంచి సికింద్రాబాద్ వరకు హైస్పీడ్ రైలు నడపనుంది. హైదరాబాద్-నాగ్పూర్ మధ్య రాకపోకలు భారీగానే ఉంటాయి. ఆ స్థాయిలో సరైన రైల్వే సౌకర్యం లేదు. దీంతో ప్రజలు ఇబ్బందుల మధ్య ప్రయాణాలు సాగిస్తుంటారు. ప్రస్తుతం ఈ మార్గంలో మొత్తం 25 రైళ్లు నడుస్తున్నాయి. అయితే, రాజధాని, శతాబ్ది ఎక్స్ ప్రెస్ వంటి సూపర్ ఫాస్ట్ రైలు అందుబాటులో లేదు.
నాగ్పూర్సికింద్రాబాద్ మధ్య 581 కి.మీ. దూరం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న రైళ్లలో ప్రయాణానికి దాదాపు 10 గంటల సమయం పడుతుంది. ఈ మార్గంలో కొత్తగా వందే భారత్ రైలు ప్రవేశపెడితే దాదాపు 3.30 గంటల సమయం తగ్గనుంది. నాగ్ పూర్-సికింద్రాబాద్ వందేభారత్ రైలు ప్రయా ణించే రూట్ సైతం భారతీయ రైల్వే సిద్దం చేసినట్లు తెలుస్తోంది.
నాగ్పూర్ నుంచి బలార్షా, సిర్పూర్ కాగజ్నగర్, మంచిర్యాల, రామగుండం, కాజీపేట జంక్షన్లలో ఆగనుంది. తిరుగు ప్రయాణంలో కూడా ఇదే స్టేషన్లలో ఆగుతుందని రైల్వే వర్గాల సమాచారం. కాగా నాగ్పూర్-సికింద్రాబాద్ వందేభారత్ రైలు నాగ్పూర్ స్టేషన్ నుంచి ఉదయం 6 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 12-30 గంటలకు, తిరిగి 1-30కు బయల్దేరి రాత్రి 8 గంటలకు నాగ్పూర్ చేరుకుంటుంది.