రాజన్న హుండీ ఆదాయం రూ.85.80 లక్షలు
Vemulawada Sri Parvati Rajarajeswara Swamy Temple: వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి హుండీల లెక్కింపు బుధవారం నిర్వహించారు. ఆలయ ఓపెన్ స్లాబ్ లో జరిగిన హుండీల లెక్కింపు ద్వారా 15 రోజులకు స్వామి వారి ఆదాయం 85లక్షల 80వేల 671 రూపాయిలు వచ్చినట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి దావు కృష్ణప్రసాద్ వెల్లడించారు. బంగారం 72.400 గ్రాములు, వెండి 4.200 కిలోలు గ్రాములు వచ్చినట్లు తెలిపారు. ఈ హుండీల లెక్కింపు కార్యక్రమంలో ఆలయ ఉద్యోగులతో పాటు శ్రీ రాజరాజేశ్వర సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.