మంచినీళ్లకు వెళ్లి… బావిలో పడ్డ ముగ్గురు మహిళలు
Komuram Bhim Asifabad District: మంచినీళ్ల కోసం వెళ్లి ముగ్గురు మహిళలు బావిలో పడ్డారు. సమయానికి వారిని చూసిన స్థానికులు కాపాడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే.. కొమరం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం గౌరీ కొలంగూడ గ్రామంలో గిరిజన మహిళలు మంచి నీరు తేవడానికి వెళ్లి ఊరవతల ఉన్న బావి వద్దకు వెళ్లారు. అయితే, నీళ్లు తీసుకునేందుకు బావి వద్దకు వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు బావిలో పడ్డారు. ఈ ఘటనలో ఆత్రం జైతు బాయి, ఆత్రం సోంబాయి, సిడం మత్తుబాయికి గాయాలయ్యాయి. సమయానికి స్థానికులు చూడటంతో వారు స్వల్పగాయాలతో బయటపడ్డారు. వారిని జైనూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి చికిత్స అందిస్తున్నారు.