బ్రేకింగ్.. మంచిర్యాల జిల్లాలో మరో హత్య

Murder: మంచిర్యాల జిల్లాలో మరో హత్య చోటు చేసుకుంది. తన భార్యతో అసభ్యకరంగా ప్రవర్తించాడని సొంత బాబాయినే హత్య చేశాడో వ్యక్తి. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం నార్లాపూర్ లో సురేష్ అనే వ్యక్తి తన సొంత బాబాయి అయిన పోషం అలియాస్ బుజ్జన్నతో గొడవ పడ్డాడు. చేను వద్ద తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించాడని సురేష్‌ను పోశంను కొట్టాడు. దీంతో పోశం కింద పడ్డాడు. 108కు ఫోన్ చేసి ఆసుపత్రికి తరలించడంతో అప్పటికే పోశం మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. కాగా, మంచిర్యాల జిల్లాలో రెండు నెలల వ్యవధిలో ఇది మూడో హత్య.