ఢిల్లీకి చిన్నయ్య పంచాయితీ
BRS MLA Durgam Chinnayya:బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఆరిజన్ డైరీ నిర్వాహకుల మధ్య తలెత్తిన వివాదం ఢిల్లీ చేరింది. ఆరిజన్ డైరీ నిర్వాహకులు ఢిల్లీ లో నిరసన చేపట్టారు. నూతన పార్లమెంట్ భవనం వద్ద ఆదివారం ఆరిజిన్ డైరీ బృందం నిరసన కార్యక్రమం తెలిపింది. బీఅర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆరిజన్ డైరీ నిర్వాహకురాలు షేజల్ ను లైంగికంగా , మానసికంగా వేధిస్తున్నారని, తమకు న్యాయం చేయాలని కోరుతూ ఈ నిరసన చేపట్టారు. దోషులను శిక్షించాలని ఫ్లెక్సీ పట్టుకుని నిరసన తెలిపారు.