ఉపాధి హామీ కూలీల ఆధ్వర్యంలో తెలంగాణ దినోత్సవం
Telangana Formation Day: ఉపాధి హామీ కూలీల ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. తాండూరు మండలం మాదారం టౌన్షిప్‌లో కేక్ కట్ చేసి వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం సబ్బండ వర్ణాల ప్రజలు ఒక్కటయ్యారని తెలిపారు. తెలంగాణ స్వప్నం సాకారమై తొమ్మిది వసంతాలు పూర్తయి, తెలంగాణ దశాబ్ది సంబురాలు చేసుకోవడం ముదావమన్నారు. జోహార్ తెలంగాణ అమరవీరులకు.. జై తెలంగాణ.. అంటూ నినాదాలు చేస్తూ సంబురాలు చేసుకున్నారు.