లక్ష సాయం… మార్గదర్శకాలు జారీ…
వెనుకబడిన వర్గాల కుల, చేతివృత్తిదారులకు ప్రభుత్వం లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇప్పటికే కేబినేట్ ఆమోదముద్ర వేసింది. అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 20 వరకు దరఖాస్తు స్వీకరిస్తారు.
మార్గదర్శకాలు ఇవీ..
1) దరఖాస్తుదారు వయస్సు 18 నుండి 55 సంవత్సరముల (జూన్, 2023 నాటికి) వరకు ఉండాలి.
2) దరఖాస్తుదారు సంవత్సరం ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంతాల వారికి 1,50,000/- లు, పట్టణ ప్రాంతాల వారికి 2,00,000/- గా నిర్ణయించారు.
3) 2017-18 , 2018-19 సంవత్సరాల్లో లో రూ.50,000/- సబ్సిడీ పొందిన వారు అనర్హులు, దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేదు.
4) ఆన్ లైన్ అప్లికేషన్ చేసేందుకు తేది 06.06.2023 నుంచి 20.06.2023 వరకు చేసుకొనుటకు అవకాశం ఉంది.
కులవృత్తిదారులు, చేతివృత్తిదారులు అర్హులు. • పనిముట్ల కొనుగోలు, ఆధునీకరణ లేదా ముడిసరుకు కొనుగోలుకు మాత్రమే ఆర్థిక సాయం అందిస్తారు.
లబ్ధిదారులను ఇలా ఎంపిక చేస్తారు..
-అభ్యర్థులు జూన్ 20 తేదీ వరకు https://tsobmmsbe. cgg.gov.in వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలి.
-రేషన్ కార్డు, కుల, ఆదాయం ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోను దరఖాస్తుతో సమర్పించాలి.
-జూన్ 20 నుంచి 28 వరకు మండల స్థాయిలో ఎంపీడీవోలు, మున్సిపాలిటీల్లో మున్సిపల్ కమిషనర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి. దరఖాస్తుదారుల వివరాలను పరిశీలిస్తారు.
-జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీకి దరఖాస్తులు, లబ్ధిదారుల జాబితా అందిస్తారు.
-ఆ కమిటీ అర్హులను గుర్తించి జాబితా సిద్ధం చేసి జూన్ 27లోగా జిల్లా ఇన్చార్జి మంత్రి ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది.
-రూ.లక్ష ఆర్ధిక సాయం కోసం ఎంపికైన లబ్దిదారుల జాబితా ఆన్ లైన్లో ప్రకటిస్తారు.
-ప్రభుత్వం ఈ ఆర్థిక సాయాన్ని లబ్దిదారుడి బ్యాంకు ఖాతాకు నేరుగా మంజూరు చేస్తుంది.
-ఆర్థికసాయం పొందిన నెలలోగా ఆ నిధులతో పనిముట్లు, ముడిసరుకును లబ్ధిదారులు కొను గోలు చేయాల్సి ఉంటుంది.