ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్
పోలీస్ వ్యవస్థ ప్రతిష్టకి భంగం కలిగించే విధంగా, క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించిన ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తున్నట్లు రామగుండం కమిషనర్ చంద్రశేఖర్రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. బెల్లంపల్లి ఏఆర్ కానిస్టేబుల్ ఎస్. తిరుపతి-901, మంచిర్యాల టౌన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఆర్. శ్రీకాంత్ పిసి-372 సస్పెండ్ చేశారు. కమిషనరేట్ పరిధిలో పనిచేసే అధికారులు, సిబ్బంది క్రమశిక్షణగా పనిచేయాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వేటు తప్పదని కమిషనర్ స్పష్టం చేశారు.