విద్యావ్యవస్థలో సరికొత్త సేవలకు శ్రీకారం…

Launch of new services in education system: ఆ యువ‌కుడు వినూత్నంగా ఆలోచించాడు.. విద్యావ్య‌వ‌స్థ‌లో మార్పులు తీసుకురావాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాడు… అన్ని సేవ‌లు ఒకే గొడుగు కింద‌కు వ‌స్తే విద్యాసంస్థ‌ల క‌ష్టాలు తీరుతాయ‌ని భావించాడు.. వెంట‌నే అనుకున్న‌ది ఆచ‌ర‌ణ‌లో పెట్టాడు. వ‌రంగ‌ల్‌కు చెందిన ఆ యువ‌కుడి ఆలోచ‌న‌కు అంద‌రూ శ‌భాష్ అంటున్నారు.

నేటి విద్యావిధానంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సాధారణ విద్య నుండి సాంకేతికత విద్య వరకు చాలా చాలా మార్పులు వ‌చ్చాయి. విద్యార్థుల‌కు ఆ స్థాయిలో విద్య అందించేందుకు విద్యాసంస్థ‌లు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నాయి. ప్రాథమిక విద్య నుండే విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యతలను తమ భుజస్కందాలపై ప్రైవేటు విద్యా సంస్థలు వేసుకుంటున్నాయి. రోజు రోజుకు వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యాసంస్థలు త‌మ‌కు కావాల్సిన వాటిని స‌మ‌కూర్చుకునేందుకు చాలా శ్ర‌మ ప‌డాల్సి వ‌స్తోంది. చాక్పీస్ నుండి హై క్వాలిఫైడ్ టీచింగ్ టీమ్ వ‌ర‌కు, నాన్ టీచింగ్ స్టాఫ్ ఇలా ప్ర‌తి విష‌యంలోనూ ఇబ్బందుల‌కు గురి కావాల్సి వ‌స్తోంది. ఇలా ప్రైవేటు విద్యా సంస్థలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సేవలు ఒకే వేదిక ద్వారా అందించేందుకు ప్రత్యేకంగా ఓ కంపెనీ స్టార్ట్ చేశాడు వరంగల్ యువకుడు నితిన్ పాలడుగుల.

పీజీ పూర్తి చేసిన నితిన్ తన ఆలోచనలను రంగరించి వినూత్న‌మైన సేవ‌లు అందించేందుకు ఓ వేదిక కావాలని భావించారు. ఇందుకు తగ్గట్టుగా ఆయన ఇటీవల myverkoper కంపెనీ ప్రారంభించారు. ఇందులో విద్యాసంస్థ‌లకు సంబంధించి క్లరికల్ స్టాఫ్ నుండి అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ వరకు, ఫస్ట్ క్లాస్ టీచర్ నుండి డీమ్డ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ల వరకు ఇలా విద్యా వ్యవస్థలో అవసరమైన ప్రతి రంగానికి సంబంధించిన స‌మాచారం పొందుప‌రిచారు. వాటికి సంబంధించిన సేవ‌లు అందించేందుకు సిద్దంగా ఉన్నానని నితిన్ పాలడుగుల వివరించారు. త‌ర‌గ‌తిగదుల్లో అవసరమైన బ్లాక్ బోర్డ్ నుండి డైనింగ్ హాల్ లో అవసరం ఉండే సామ‌గ్రి వరకు ప్రతిది తన కంపెనీ ద్వారా డీల్ చేసుకోవచ్చని చెప్తున్నారు.

విద్యా సంస్థల్లో యూనిఫామ్స్, బ్యాడ్జెస్, టైస్, టెక్ట్స్ బుక్స్, అడ్మినిస్ట్రేషన్ పరంగా అవసరమయ్యే వైట్ పేపర్ నుండి ప్రింటర్ వరకు యాజమాన్యాలు షాపులకు వెళ్లి కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంటుంది. దీనివల్ల ఆయా విద్యా సంస్థలు ప్రత్యేకంగా స‌మ‌యం వృథా చేసుకోవ‌డ‌మే కాకుండా, కొన్ని సంద‌ర్భాల్లో వాటికి సంబంధించిన స‌మాచారం ఎక్క‌డ దొరుకుతుందో తెలియ‌ని ప‌రిస్థితి. అలాంటి పరిస్థితులకు చెక్ పెట్టేస్తూ విద్యాసంస్థలకు అవసరమయ్యే ప్రతి వస్తువు, ప్రతి ఎంప్లాయిని తమ కంపెనీ ద్వారా పొందే విధంగా కార్యాచరణ తయారు చేశామని చెప్పారు నితిన్. ఇందుకోసం విద్యా సంస్థలు తమ కంపెనీలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారికి ఏఏ సేవలు అవసరమో అందుకు సంబంధించిన వాటిని వారికి అందుబాటులోకి తీసుకొచ్చే బాధ్యత తమదేనని కంపెనీ ఫౌండర్ నితిన్ పాలడుగుల చెప్తున్నారు. హైదరాబాద్ హైటెక్ సిటీలో ఏర్పాటు చేసిన ఈ కంపెనీ ద్వారా ఆన్ లైన్ లోనే విద్యా సంస్థలు తమ సేవలను వినియోగించుకోవచ్చంటున్నారు నితిన్. అంతర్జాతీయ స్థాయిలో తొలిసారి చేస్తున్న ఈ ప్రయత్నం తెలంగాణ గడ్డ మీదుగా ప్రారంభించారాయన.

myverkoper సంస్థ ద్వారా అందించే సేవల వివరాలివే…

Books & Worksheets,
E-Learning

Assessment Solutions

Olympiad Exams

T
raining & Development

Career Guidance & Counselling services

Newspapers & Magazines

Uniforms

Shoes

Bags & Backpacks

Costumes & Fancy Dresses

Stationery
Lunch Boxes, Bottles & Flasks

Furniture

Decor & Furnishings

Lab Supplies

Student Projects

Sports & Play
Toys & Games

Electronics

Software Solutions

Music & Band Instruments

Awards & Certificates

Housekeeping & Cleaning Supplies
Personal Hygiene & Care

Recruitment & Staffing

Tours, Excursions & Camps

Event Management

Fresh Vegetables & Fruits

Food & Beverages

Packaged Drinking Water Services

Vehicles & Transportation

Loans & Finances

Business Planning & Management

Computer & Laptop Repair Services

Uniform Tailoring Services

House Keeping Services

Canteen & Catering Services

Digital Printing Services

Digital Marketing

Computer & Networking Solutions

Telecommunication Services

Building & Construction Supplies

Lifts & Escalators

Grills, Gates & Fences

Safety Equipment & Prevention Products

ఈ రంగాల్లో myverkoper సంస్థ సేవలందించేందుకు రంగం సిద్దం చేసుకుంది. Email Id: we@myverkoper.com ద్వారా కూడా మెయిల్ చేసినట్టయితే స్పందిస్తామని నితిన్ పాలడుగుల తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like