ఎల్ఐసీ కీలక నిర్ణయం..

ఒడిశా రైలు ప్రమాద బాధితులకు ఊరట!

LIC: ఒడిషా బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో 280 మందికిపైగా మృతి చెందిన విషయం తెలిసింది. ఈ క్రమంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఓ మంచి నిర్ణయం తీసుకుంది. బాధితులకు ఆర్థిక పరమైన రిలీఫ్ కలిగించేందుకు క్లెయిమ్ సెటిల్‌మెంట్‌లో ఉన్న అడ్డంకులను తొలగిస్తున్నట్లు తెలిపింది. త్వరితగతిన ఎల్ఐసీ పాలసీ క్లెయిమ్ సెటిల్‌మెంట్ చేస్తామని స్ప‌ష్టం చేసింది.

ఈ మేరకు ఎల్ఐసీ ఛైర్‌పర్సన్ సిద్ధార్థ మోహంతీ ప్రకటన చేశారు. కోర‌మాండ‌ల్ రైలు ప్ర‌మాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ప్రమాద బాధితులకు అండగా నిలిచేందుకు ఎల్ఐసీ కట్టుబడి ఉంది. ఫైనాన్షియల్ రిలీఫ్ అందించేందుకు క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్ మినహాయిస్తున్నామ‌ని వెల్ల‌డించారు. ఎల్ఐసీ పాలసీలతో పాటు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద ఉన్న పాలసీ సెటిల్మెంట్లను సైతం సులభతరం చేస్తామన్నారు.

రిజిస్టర్డ్ డెత్ సర్టిఫికెట్స్, రైల్వే అధికారులు, పోలీసులు లేదా ఏదైనా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రకటన చేసిన మరణాల వివరాలను బాధితుల మరణాలకు ప్రూఫ్‌గా స్వీకరిస్తామని ఎల్ఐసీ తెలిపింది. డివిజనల్, బ్రాంచ్ స్థాయిలో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లను సైతం ఏర్పాటు చేస్తామని ఆ సంస్థ స్ప‌ష్టం చేసింది. వాటి ద్వారా క్లెయిమ్ సంబంధిత ప్రశ్నల నివృత్తితోపాటు క్లెయిమ్ సెటిల్మెంట్‌లో సహాయం అందిస్తామని, త్వరితగతిన క్లెయిమ్ సెటిల్మెంట్ చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఎల్ఐసీ సంస్థ అధికారులు తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like