ట‌మాటాల‌తో తులాభారం

Tomato: టమాటాల ధరలు పెరగడం ఏమో గాని దేశవ్యాప్తంగా చిత్ర విచిత్రమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొందరు టమాటా పంట పొలాలకు సెక్యూరిటీ గార్డులను కాపలా పెడుతుంటే, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకొని టమాటా పంటను రక్షించుకుంటున్న వీడియోలు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. టమాటా పంట దొంగతనాలు, మార్కెట్లలో కూడా టమాటాలను దొంగతనం చేసేవారు, పుట్టినరోజు వంటి శుభకార్యాలకు టమాటలను బహుమతిగా ఇస్తున్న సంఘటనలు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇక ఏకంగా దేవాలయాల్లో ట‌మాట‌ల‌తో మొక్కులు తీర్చుకున్న ఘ‌ట‌న ముక్కున వేలేసుకునేలా చేసింది.

దేవుడికి నాణేల‌తోనో, బెల్లం, పంచదార‌తో తులాభారం వేసి మొక్కులు చెల్లించుకుంటారు. ఆ నిలువెత్తు సొత్తుని దేవుడికి సమర్పిస్తారు. అయితే, త‌మ కూతురి కోసం అరుదైన తులాభారం నిర్వ‌హించారు త‌ల్లిదండ్రులు. ఇప్పుడు అది వైర‌ల్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లా కేంద్రంలో అనకాపల్లి పట్టణానికి చెందిన మళ్ల జగ్గ అప్పారావు, మోహిని దంపతుల కుమార్తె భవిష్య.. వారి మొక్కుబడి తీర్చుకోడానికి ఆలయానికి వచ్చారు. తమ కుమార్తెకు ట‌మాట‌ల‌తో తులాభారం వేశారు. 51 కిలోల ట‌మాట‌ల‌ను తులాభారం వేశారు. టమాటాల రేటు భారీగా పెరిగిన నేపథ్యంలో ఈ తులాభారం వ్యవహారం ఆసక్తిగా మారింది.

అదేవిధంగా, గ‌తంలో మొక్కుకున్న విధంగానే నిలువెత్తు బంగారం(బెల్లం), పంచదార‌తో మొక్కుబడి సైతం తీర్చుకున్నారు. తులాభారం తర్వాత టమాటాలను నిత్యాన్నదానం కోసం ఉపయోగించారు. వీరు ఇచ్చినటువంటి టమాటాలు, బెల్లం, పంచదారలను అమ్మవారి నిత్యాన్నదాన కార్యక్రమంలో ఉపయోగిస్తామని దేవస్థానం అధికారులు తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like