మా పోరాట ఫ‌లిత‌మే రైల్వే అండర్ బ్రిడ్జి

మంచిర్యాల బీజేపీ నాయ‌కుల పోరాట ఫ‌లిత‌మే టూ టౌన్‌కు అండ‌ర్ బ్రిడ్జి మంజూర‌య్యింద‌ని బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్ తెలిపారు. సోమ‌వారం మంచిర్యాలలో ముఖారమ్ చౌరస్తా నుండి టూ టౌన్ కు నిర్మిస్తున్న రైల్వే అండర్ బ్రిడ్జి పనులను ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ మంచిర్యాల పట్టణ బిజెపి నాయకుల పోరాటం కారణంగా టూ టౌన్ కు రైల్వే అండర్ బ్రిడ్జి మంజూరు అయింద‌న్నారు. గతంలో సమస్యపై రైల్వే శాఖ మంత్రి, సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులను కలిసి బ్రిడ్జి నిర్మించాలని కోరిన‌ట్లు చెప్పారు. దీనిపై ఒక్క రోజు దీక్ష సైతం చేప‌ట్టిన‌ట్లు వెల్ల‌డించారు. రైల్వే అండర్ పాస్ పనులు వెంటనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చి ప్రజల కష్టాలు తీర్చాల‌ని తెలిపారు. మంచిర్యాల పట్టణ టూ టౌన్ ప్రజల చిరకాల కోరిక నెరవేర్చినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రైల్వే అండర్ బ్రిడ్జి కేవలం తాత్కాలిక పరిష్కారం మాత్రమే అని మంచిర్యాల పట్టణ ట్రాఫిక్ శాశ్వత పరిష్కారానికి లక్ష్మీ టాకీస్ నుండి రాజీవ్ నగర్ వరకు మరొక వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వంగపల్లి వెంకటేశ్వర్ రావు, పెద్దపల్లి పురుషోత్తం, కర్ణ శ్రీధర్, మల్యాల శ్రీనివాస్, రంగ శ్రీశైలం, బియ్యాల సతీష్ రావు, పట్టి వెంకట కృష్ణ, దాస్య నాయక్, గాజుల ప్రభాకర్, జోగుల శ్రీదేవి, ముదాం మల్లేష్, ఆకుల సంతోష్, బల్ల రవి, కొండవీటి వేణు మేన సూరి, కమేర అర్జున్, రాకేష్ రేన్వ, రెడ్డిమళ్ల అశోక్, శానగొండ రాజేందర్ పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like