మా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించండి

క‌విత‌ను క‌లిసిన సింగ‌రేణి యువ కార్మికులు

మంచిర్యాల : త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని సింగ‌రేణిలో ప‌లువురు యువ కార్మికులు టీబీజీకేఎస్ గౌరవధ్యక్షురాలు క‌విత‌ను కోరారు. శ‌నివారం ఆ యూనియ‌న్ అధ్య‌క్ష‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు వెంకట్రావు, మిర్యాల రాజిరెడ్డితో పాటు ఆమెను క‌లిసి సమస్యలు వివరించారు. సింగరేణిలో ఇంటర్నల్ నోటిఫికేషన్ త్వరితగతిన ఇచ్చేలా చూడాల‌ని కోరారు. అదే విధంగా ఇంటర్నల్ వారికి ఎన్ఓసి క్లియరెన్స్ సర్టిఫికెట్స్ ఇప్పించాలన్నారు. పారా మెడికల్ కి సంబంధించిన ఖాళీలు భర్తీ చేయాలని, అపాయింట్మేంట్ అయిన కార్మికులకు వెంటనే పనిముట్లు పిపిఈ ఇప్పించేలా చూడాల‌ని కోరారు. సింగరేణిలో ఎస్అండ్‌పీసీ సెక్యూరిటి గార్డ్స్ నోటిఫికేషన్ జారీ చేయించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. 2020-21 లో 190/240 మస్టర్లు సాధించిన బదిలీ వర్కర్స్ కి జనరల్ మజ్దూర్ ఇవ్వాల‌న్నారు. నూతనంగా ఉద్యోగం లో చేరుతున్న వారికి అదే ఏరియాలో పోస్టింగ్ ఇప్పించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిద్దంశెట్టి సాజన్‌, సాదుల‌ సంతోష్, చెల్పూరి సతీష్, నరేష్ నేత, అవినాష్ రెడ్డి, హర్షవర్ధన్, కిర‌ణ్‌, కాదాసి సురేష్, సూర్య‌నారాయ‌ణ‌, సూరి నాయక్, పూసాల నరేష్, శ్రీనివాస్, దేవేందర్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like