మహిళా దినోత్సవ సంబురాలకు టీఆర్ఎస్ పిలుపు

- మ‌హిళా దినోత్స‌వం ఘ‌నంగా నిర్వ‌హించండి
- మహిళాబంధు కెసీఆర్ పేరిట సంబురాలు
- 6,7,8 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వ‌హించండి
- ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తారకరామారావు టెలికాన్ఫరెన్స్

అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా వేడుక‌లు ఘ‌నంగా చేయాల‌ని టీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి తారకరామారావు టెలికాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం చేపట్టిన అద్భుతమైన సంక్షేమ, సంరక్షణ, కార్యక్రమాల నేపథ్యంలో మహిళా దినోత్సవ సంబురాలు చేయాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ఈ నెల 6,7,8 తేదీలో మహిళబంధు కేసీఆర్ పేరిట సంబురాలు చేయాల‌న్నారు.

ఆర‌వ తేదీన సంబురాలు ప్రారంభం అవుతాయి. ఇందులో కేసీఆర్ గారికి రాఖీ కట్టడం..పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్లు, ప్రతిభ కలిగిన విద్యార్థినిలు, ఆశా వర్కర్లు ఎఎన్ఎంలు స్వయం సహాయక సంఘాల నాయకురాళ్లు తదితర మహిళలకు గౌరవపూర్వక సన్మానం చేస్తారు. కేసీఆర్ కిట్, షాదీ ముబారక్ థాంక్యూ కేసీఆర్ వంటి ఆకారం వచ్చేలా మానవహారాలు ఏర్పాటు చేయడం చేస్తారు. ఏడో తేదీన మహిళా సంక్షేమ కార్యక్రమాలు కల్యాణలక్ష్మి, కెసిఆర్ కిట్ లు, ఇతర మహిళా సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారులను నేరుగా ఇంటివద్దకెళ్లి కలవడం, లబ్ధిదారులతో సెల్ఫీలు తీసుకోవడం చేయాలి. 8 తేదీన నియోజకవర్గ స్థాయిలో మహిళలతో సమావేశం, సంబురాలు నిర్వ‌హించ‌నున్నారు.

గతంలో పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రైతుబంధు వారోత్సవాలు, కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన టిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. 10 లక్షల మంది పేద ఇంటి ఆడబిడ్డలకు పెళ్లి చేసిన దేశంలోని తొలి ప్రభుత్వం టీఆర్ఎస్ అన్నారు. సుమారు 11 లక్షల మంది కెసిఆర్ కిట్ లబ్ధిదారుల మైలురాయిని చేరుకుందన్న విష‌యాన్ని ఆయ‌న ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. ఇంతటి ఘనమైన మహిళా సంక్షేమ మైలురాళ్లను చేరుకున్న నేపథ్యంలో, ఈసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని టిఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తుంద‌ని చెప్పారు.

నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవంలో ఎదురైన క్షేత్రస్థాయి సమస్యలకు పరిష్కారం ఇస్తున్న గొప్ప పాలకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి కేటీఆర్ తెలిపారు. అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను రూపకల్పన చేశారన్నారు. అందుకే మ‌హిళా దినోత్స‌వ కార్య‌క్ర‌మాలు అద్భుతంగా నిర్వ‌హించేందుకు అంద‌రూ ముఖ్యంగా పార్టీ శ్రేణులు ముందుకు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like