మహిళపై TBGKS గుండాల దాడి సిగ్గుచేటు

-ఆమె పై దాడికి పాల్పడ్డ వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
-మహిళా ఉద్యోగుల పై అరాచకాలను అరికట్టాలి
-ఇప్పటికైనా మహిళల కోసం ప్రత్యేక గ్రీవేన్స్ సెల్ ఏర్పాటు చేయాలి
-INTUC సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ డిమాండ్

మంచిర్యాల : ఒక మ‌హిళ‌పై టీబీజీకేఎస్ గుండాల దాడి సిగ్గు చేట‌ని INTUC సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆర్జీ 1 ఏరియాలో వ‌ర్క్‌షాప్ లో స్వ‌ప్న అనే మ‌హిళా కార్మికుల రాలిపై జరిగిన దాడి సంద‌ర్భంగా వ‌ర్క్‌షాపు వ‌ద్ద ఆ మ‌హిళ చేస్తున్న ఆందోళ‌న‌కు ఆయ‌న‌కు మ‌ద్దతు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ బాధిత మ‌హిళ‌కు అండ‌గా ఉంటామ‌ని హామీ ఇచ్చారు. గతంలోనే స్వామి దాస్ లైంగిక వేధింపులకు పాల్పడితే, ఉన్నతాధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చినా వారు ప‌ట్టించుకోలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వారు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ మృగాలు రెచ్చిపోయి ఇలా ప్రవర్తిస్తున్నారని అన్నారు. ఇటువంటి నీచులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. శాఖాపరమైన చర్యలే కాకుండా చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలని కోరారు. అతని పై రౌడషీట్ ఓపెన్ చేయాలని, బాధితురాలి కుమార్తెను సైతం కొట్టిన వారిపై పోక్సో చ‌ట్టం అమ‌లు చేయాలని జనక్ ప్రసాద్ డిమాండ్ చేశారు.

ఈ విషయంపై సింగరేణి డైరెక్టర్లు, సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడి తక్షణ చర్యలకు డిమాండ్ చేశారు. ఇంత పెద్ద సంస్థలో మహిళా ఉద్యోగులు తమ సమస్యలను చెప్పుకోవడానికి ప్రత్యేక విభాగం లేకపోవడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం మేల్కొని మహిళ అధికారిణితో ప్రత్యేక గ్రీవేన్స్ సెల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్య‌క్ర‌మంలో ఆయ‌న‌తో పాటు కేంద్ర కమిటి సీనియర్ ఉపాధ్యక్షుడు ఎస్‌.నరసింహ రెడ్డి, కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి & ఆర్జీ ఏరియా ఉపాధ్యక్షుడు పీ. ధర్మపురి, కేంద్ర క‌మిటీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు సీ.త్యాగరాజన్, కాంపెళ్లి స‌మ్మయ్య‌, కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు పీ. రాజేంద‌ర్‌,కేంద్ర కమిటి ఉపాధ్యక్షుడు & శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు జే. శంకర్రావు, కేంద్ర కమిటీ చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నరేందర్ రాంశెట్టి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like