మహిళల కోసం ఎల్ఐసీ ఆధార్ శిలా పాలసీ

పొదుపు చేయాలంటే ఎక్కువ మంది చూసేది ఎల్ఐసీ వైపు. మంచి రాబడి అందించే సురక్షిత పాలసీలను అందిస్తుంది ఈ సంస్థ‌. మ‌హిళ‌ల కోసం ఎల్ఐసీ ఓ ప్ర‌త్యేక పాల‌సీ అందిస్తోంది. ఆధార్ శిల పేరుతో ఈ పాలసీ తెచ్చింది. మహిళలు తక్కువ పెట్టుబడితో లక్షల రూపాయలను పొందవచ్చు. ఆధార్ ఐడీలు కలిగిన మహిళలు ఎల్ఐసీ ఆధార్ శిల పాలసీలో పెట్టుబడి పెట్టవచ్చు. పాలసీలో ప్రవేశానికి కనీస వయస్సు 8 సంవత్సరాలు. గరిష్టంగా వయస్సు 55 సంవత్సరాలు. ఆకర్షణీయ రాబడితో పాటు ఇతర లాభాలు ఈ పాలసీ ప్రత్యేకత. ఒక మహిళా పెట్టుబడిదారు కనీసం రూ. 75 వేల నుంచి గరిష్టంగా రూ. 3 లక్షల బీమాను పొందవచ్చు. క్వార్టర్ లేదా ఆర్నెళ్లు లేదా ఏడాది ప్రాతిపదికన డిపాజిట్ చేయవచ్చు. కనీసం 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఉదాహరణకు రూ. 3 లక్షల 97 వేలు పొందడానికి సంవత్సరానికి రూ. 10,959 లేదా నెలకు దాదాపు రూ. 899 చొప్పున 20 ఏళ్లపాటు పెట్టుబడి చెల్లించాలి. అంటే మీరు దాదాపు రూ. 2 లక్షల 14 వేలు ప్రీమియంగా చెల్లిస్తారు. మిగిలినవి మెచ్యూరిటీ సమయంలో మీరు పొందే వడ్డీ అవుతుంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like