ఫ్లాష్‌… ఫ్లాష్‌.. మంత్రుల‌తో కేసీఆర్ అత్య‌వ‌స‌ర భేటీ

హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అందుబాటులో ఉన్న మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఎర్రవల్లి ఫాంహౌస్‌లో ఈ భేటీ జరుగుతోంది. సమావేశానికి మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు,గంగుల కమలాకర్‌,తలసాని,ప్రశాంత్‌రెడ్డి,శ్రీనివాస్‌గౌడ్‌,జగదీశ్‌రెడ్డి,ఇంద్రకరణ్‌రెడ్డి,కొప్పుల ఈశ్వర్‌తోపాటు సీఎస్‌, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఎంపీ సంతోష్‌, ఎమ్మెల్సీ కవితలకు కూడా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఈ భేటీలో పాల్గొనాల్సిందిగా పిలుపు వచ్చింది. పాలనాపరమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం. నియామకాలు, వ్యవసాయం, ఇతర అంశాలపై మంత్రులు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like