మంత్రి దృష్టికి అక్ర‌మ‌క‌ట్ట‌డాలు

బెల్లంప‌ల్లిలో అక్ర‌మ క‌ట్ట‌డాల విష‌యంలో మంత్రి కేటీఆర్ దృష్టికి వెళ్లింది. ఇక్క‌డ అక్ర‌మ క‌ట్ట‌డాలు క‌డుతున్న విష‌యాలు బెల్లంప‌ల్లి వాస్త‌వ్యుడు, ఎన్ఆర్ ఐ కృష్ణారెడ్డి మున్సిప‌ల్ శాఖ మంత్రి తార‌క‌రామారావు దృష్టికి తీసుకువెళ్ల‌డంతో ఆయ‌న స్పందించారు. మంత్రి కేటీఆర్ గురువారం ఆస్క్ కేటీఆర్ పేరుతో కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ప్ర‌భుత్వ భూమి స‌ర్వే నంబ‌ర్ 170లో సెక్షన్ 178 & 191 మున్సిపల్ చట్టం 2019 కివిరుద్దం గా క‌ట్ట‌డాలు ఏర్పాటు చేశార‌ని మంత్రి దృష్టికి తీసుకువ‌చ్చారు. అంతేకాకుండా ఆ నిర్మాణాలు టి ఎస్ బి పాస్ చట్టం కు విరుద్ధంగా ఉన్నాయ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ అక్రమ కట్టడాలు, బజార్ ఏరియా లో ఉన్న వైన్ షాప్ తొలగించాలని మంత్రిని కోరారు. దీనికి స్పందించిన మంత్రి స్పందించిన సిడిఎంఏ తెలంగాణ మున్సిపల్ కమిషనర్ కు అక్క‌డ ప‌రిశీలించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశాలు ఇచ్చారు. ఫిర్యాదు చేసిన వెంట‌నే స్పందించిన పుర‌పాల‌క శాఖ మంత్రికి కృష్ణారెడ్డి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అధికారులు ఎలాంటి ఒత్తిళ్ల‌కు త‌లొగ్గ‌కుండా అక్ర‌మ క‌ట్ట‌డాలు కూల్చివేయాల‌ని, క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like