మంత్రి కేటీఆర్ కాలికి గాయం..

మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాలికి గాయ‌మైంది. కాలుజారీ కింద‌ప‌డ‌డంతో పాదం (ఆంకిల్ లిగిమెంట్‌) బెనికింది. దీంతో న‌డ‌వ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. కాగా, మూడు వారాలు రెస్ట్ తీసుకోవాల‌ని డాక్ట‌ర్లు చెప్ప‌డంతో ఇంట్లోనే ఉండిపోయారు. ఈ మేర‌కు కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇవాళ కింద ప‌డిపోయాను. దీంతో ఎడ‌మ కాలి మ‌డ‌మ‌కు గాయ‌మైంది. మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలి… అంటూ కేటీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

రేపు (ఆదివారం) ఆయ‌న పుట్టిన రోజు ఉంది. రాష్ట్రంలో వ‌ర్షాలు ప‌డుతున్న నేప‌థ్యంలో తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు . భారీ వర్షాలు, పలు జిల్లాల్లో వరదల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.. పార్టీ శ్రేణులు ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం కింద సహాయం చేయాలని పిలుపునిచ్చారు. మ‌రోవైపు త‌న‌కు కాలికి గాయం కావ‌డంతో త‌న‌కు ఈ మూడు వారాలు ఓటీటీలో ఉన్న కంటెంట్ లో ఏది చూడాలో తెలియజేయాలని అభిమానులను కోరారు. అదే త‌న‌కు ఇప్పుడు కాస్త రిలీఫ్ ఉంటుంద‌ని ఆయ‌న త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like