మ‌రో కొత్త న్యూస్ ఛాన‌ల్

ఇప్పుడు అంతా డిజిట‌ల్ మ‌యం అయిన నేప‌థ్యంలో జీ నెట్‌వ‌ర్క్ నుంచి మ‌రో ఛాన‌ల్ రాబోతోంది. ఇప్ప‌టికే దానికి సంబంధించి ప‌నులు పూర్తి చేసుకున్నారు. ఈ నెల 25న జీ నెట్‌వ‌ర్క్ చైర్మ‌న్ చేతుల మీదుగా నాలుగు భాష‌ల్లో ఛాన‌ళ్ల‌ను ప్రారంభించనున్నారు. ప్ర‌స్తుతం ఓటీటీ ప్లాట్‌ఫాం వేదిక‌గా ఈ ఛాన‌ళ్లు న‌డ‌వ‌నున్నాయి. తెలుగు, త‌మిళం, మ‌ళ‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో ప్రాంతీయ వార్త‌ల‌ను అందించ‌నున్నారు. జీ నెట్‌వ‌ర్క్ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. జీ న్యూస్‌కు సంబంధించిన ప్రోమోలు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ప్ర‌స్తుతం ఓటీటీ వేదిక‌గా అందిస్తున్న ఈ వార్త‌లు అక్టోబ‌ర్‌, సెప్టెంబ‌ర్ వ‌ర‌కు శాటిలైట్ ప్ర‌సారాల‌ను సైతం అందించ‌నున్నారు. గ‌తంలో జీ న్యూస్ 24 గంట‌లు వార్త‌లు అందించేది. త‌ర్వాత కాలంలో కేవ‌లం ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కే ప‌రిమితం అయ్యింది. ఈ నెల 25 నుంచి వార్త‌ల‌ను సైతం అందించ‌నుంది. జీ నెట్‌వ‌ర్క్ సైతం డిజిట‌ల్ మీడియాలోకి అడుగుపెడుతుండ‌టంతో ప్ర‌జ‌ల‌కు నాణ్య‌మైన వార్తాప్ర‌సారాలు అందుతాయ‌ని వీక్ష‌కులు ఆశిస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like