మ‌రో వివాదంలో శిల్పాశెట్టి దంప‌తులు..

పోర్నోగ్ర‌ఫీ కేసులో ఇప్ప‌టికే తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న రాజ్‌కుంద్రా తాజాగా మ‌రో వివాదంలో చిక్క‌కున్నారు. బాలీవుడ్​ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్​కుంద్రా పై చీటింగ్​ కేసు నమోద‌య్యింది. ముంబయికి చెందిన నితిన్​ బరాయ్​ అనే వ్యాపారవేత్త వీరిద్దరితో పాటు మరికొంతమందిపై కేసు పెట్టారు.

ఇవే ఆరోపణలు..

శిల్పాశెట్టి, రాజ్​కుంద్రా ప్రారంభించిన ఫిట్​నెస్​ ఎంటర్​ప్రైజెస్​ కోసం దేశవ్యాప్తంగా పెట్టుబడిదారుల నుంచి ఈ జంట డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇందులో భాగంగా తన దగ్గర నుంచి రూ.కోటి 51 లక్షలు తీసుకున్నారని తిరిగి ఇవ్వాలని అడిగితే తనను బెదరిస్తున్నారని ఆ వ్యాపారవేత్త ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇటీవలే బెయిల్..

పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్‌ అయిన హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాకు ముంబయి కోర్టు ఇటీవల బెయిల్‌ మంజూరు చేసింది. రూ.50 వేల పూచీకత్తుపై రాజ్‌కుంద్రాకు బెయిల్‌ మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రాజ్‌కుంద్రాతో పాటు మరో నిందితుడు ర్యాన్ తోర్పేకు కూడా బెయిల్ మంజూరైంది. అశ్లీల చిత్రాల కేసులో జులై 19 నుంచి రాజ్‌కుంద్రా కస్టడీలో ఉన్నారు. పోర్న్ సినిమాల రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తూ వాటిని కొన్ని మొబైల్ యాప్స్‌లో రిలీజ్ చేస్తున్నట్లుగా రాజ్‌కుంద్రాపై అభియోగాలు వచ్చాయి. ఈ ఆరోపణలతో ముంబయి పోలీసులు రాజ్‌కుంద్రాను అరెస్ట్ చేశారు.

కుంద్రా బాలీవుడ్‌లో సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న యువతులు, మోడళ్లను అశ్లీల చిత్రాల్లో నటించేలా ఒప్పిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. వారితో పోర్న్ మూవీస్ తీస్తున్నారని.. ఇందుకోసం ఏజెంట్ల ద్వారా కెన్రిన్ సంస్థ నిధులు సమకూర్చిందని.. చిత్రీకరణ తర్వాత కుంద్రా టీం వీడియోలను కెన్రిన్‌ సంస్థకు ఓ అప్లికేషన్‌ ద్వారా పంపిస్తోందని పోలీసులు చెబుతున్నమాట. భారత చట్టాలను తప్పించుకునేందుకు ఆ వీడియోలను బ్రిటన్‌ నుంచి హాట్‌షాట్స్‌ యాప్‌తో పాటు మరికొన్ని యాప్‌లలోనూ అప్‌లోడ్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది..

ఈ పోర్న్ కంటెంట్‌ను చూసేందుకు ఛార్జీలు వసూలు చేసేవారని.. దీని ద్వారా కుంద్రా కోట్ల రూపాయలు ఆర్జించాడని పోలీసులు వెల్లడించారు. ఈ వ్యవహారంపై ఓ బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఫిబ్రవరిలో కేసు నమోదైంది. ఇప్పటివరకూ ఈ కేసులో 11 మందిని అరెస్టు చేయడంతో పాటు రూ.7.5 కోట్లను సీజ్‌ చేసినట్లు పోలీసులు చెప్పారు. కుంద్రాపై నేరం రుజువైతే 7 ఏళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like