మరోసారి తిరుమ‌ల ఘాట్ రోడ్డు మూసివేత

కుండపోత వర్షంతో తిరుమల కొండకు వెళ్లే దారి మ‌రోసారి మూతపడింది. ఉప్పెనలా పొంగిన వరదలతో కాలినడను కూడా భక్తుడు శ్రీవారి సన్నిధికి చేరే వీలులేకుండా పోయింది. ఆర్టీసీ బస్సులను నిలిపేయడంతోపాటు, రెండు ఘాట్‌ రోడ్లను మూసేయాల్సి వచ్చింది.తిరుమల కొండపై కురిసిన భారీ వర్షాలకు వరద నీరు మెట్ల మార్గంలో కిందకు పారుతోంది. దీంతో భక్తులు కొండపైకి ఎక్కలేని పరిస్థితి నెలకొంది. కొండ కిందే ఉన్న కపిలతీర్థంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది.

కొండ పైనుంచి ఉధృతంగా నీరు కిందకు పడుతోంది. దీంతో కపిల తీర్థం గుండం పొంగి, రోడ్డుపైకి వచ్చి చేరింది నీరు. దీంతో జనావాసాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. రెండో ఘాట్‌ రోడ్డులోని 14వ కిలోమీటర్‌ వద్ద కొండ చరియలు విరిగిపడుతున్నాయి. గతంలో కురిసిన భారీ వర్షాలకు ఘాట్‌రోడ్‌లో మట్టి తడిసి పోయింది. ఇప్పుడు పడుతున్న వర్షానికి చెట్లు కూలుతున్నాయి. దీంతో ఆర్టీసీ బస్సులను కూడా నిలిపివేశారు అధికారులు.మునుపెన్నడూ ఇలాంటి వర్షాన్ని చూడలేదంటున్నారు తిరుపతి వాసులు. భారీ వర్షం కారణంగా స్వామివారి చెంతకు చేరే దారులను ముసివేసిన సందర్భం లేదంటున్నారు. వరదకు దుకాణాలు సైతం కొట్టుకుపోయాయి. తిరుమల కొండపై అనేక చోట్ల భారీ వృక్షాలు కూలిపోయాయి. దీంతో వాటిని తొలగిస్తున్నారు అధికారులు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like