మసీదు పునర్నిర్మాణానికి విరాళం అందజేత

మంచిర్యాల : తాండూర్ మండలం మాదారం టౌన్ షిప్ జామ మజీద్ పునర్నిర్మానం కోసం విరాళం అందించారు. జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియోద్దీన్ తన తల్లి గారి పేరుమీద 50,000/- రూపాయలను అందించారు. ఆయన మంచిర్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ప్రవీణ్ కి పంపించారు. గురువారం బెల్లంపల్లిలోని తన నివాసంలో జామ మజిద్ పెద్దలకు రేణికుంట్ల ప్రవీణ్ చేతుల మీదుగా ఈ డబ్బులు అందచేశారు. కార్యక్రమంలో టి ఆర్ ఎస్ నాయకులు కుమార స్వామి, మల్లేష్, శ్రీనివాస్ జమీ ల్ అహ్మద్ , రషీద్, హనీఫ్, రియాజ్, హమీద్, ఫిరోజ్,గౌస్ తదితరులు పాల్గొన్నారు

Get real time updates directly on you device, subscribe now.

You might also like