మీది రాజకీయ ప్రేమ

టీఆర్ఎస్ పై టీపీసీసీ కార్యదర్శి మత్తమారి సూరిబాబు ధ్వజం

ఎనిమిది సంవత్సరాలు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఏనాడు సింగరేణి కార్మికుల గురించి మాట్లాడలేదని, ఇప్పుడు రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ప్రేమ నటిస్తోందని టీపీసీసీ కార్యదర్శి మత్తమారి సూరిబాబు ధ్వజమెత్తారు. బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. టీఆర్ఎస్కర్మికుల అభివృద్ధి కోసం కానీ కార్మిక వర్గం కోసం కానీ మాట్లాడిన పాపానా పోలేదన్నారు. కార్మికుల పక్షాన పోరాటాలు చేస్తామని రిలే నిరాహార దీక్షలు చేస్తామని కొత్త డ్రామా ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక వర్గం మీ మాయమాటలు వినే పరిస్థితి లో లేరని చెప్పారు. నిజం గా సింగరేణి కార్మికులపట్ల చిత్త శుద్ధి ఉంటే తక్షణమే అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి ఒక తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. టీఆరెఎస్ MPలు పార్లమెంట్ లో ఎందుకు పోరాటం చేయరని ఈ సందర్భంగా సూరిబాబు ప్రశ్నిచారు. కార్మికులు, ప్రజలు మీకు అధికారం ఇస్తే సిగ్గు లేకుండా వీధి పోరాటాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు, కార్మిక వర్గం మీ పోకడలను గమనిస్తున్నారని అన్నారు. చిత్త శుద్ధి తో కార్మికుల పక్షాన నిలబడి పోరాటం చేయాలని టీఆర్ఎస్ నేతలను కోరారు. ఈ కార్యక్రమం లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గెల్లి జయరాం యాదవ్, బెల్లంపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ అబ్జల్, టౌన్ మాజీ అధ్యక్షుడుముచ్చర్ల మల్లయ్య, మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సిలువెరి సత్యనారాయణ, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ ఉపాధ్యక్షుడు మంతెన కొమురయ్య, ఎస్సి సెల్ జిల్లా సెక్రటరీ మేకల శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ ఉపాధ్యక్షుడు బర్రె మధునయ్య, ఎస్సి సెల్ టౌన్ సెక్రటరీ దాసరి ప్రతాప్, దేవసాని ఆనంద్, మహమ్మద్ గౌస్ పాల్గొన్నారు

Get real time updates directly on you device, subscribe now.

You might also like