ఆయిల్‌పామ్‌పై రైతుల‌కు పూర్తి అవ‌గాహ‌న క‌ల్పించాలి

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఎన్నికల కమిషనర్ శశాంక గోయల్

ఆయిల్‌పామ్‌పై రైతుల‌కు పూర్తి అవ‌గాహ‌న క‌ల్పించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్ల‌డించారు. హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలో ఆయ‌న ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి ఆయిల్ ఫెడ్ ఎండీ సురేందర్ రెడ్డి తదితరులతో క‌లిసి స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కేటాయించిన జిల్లాలలో పామాయిల్ ఫ్యాక్టరీల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ఆయా జిల్లాల కంపెనీలకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. అప్పుడే ఆయిల్ పామ్ సాగుపై రైతాంగానికి నమ్మకం కలుగుతుందని స్ప‌ష్టం చేశారు. జిల్లాల వారీగా రైతులను కొత్తగూడెం జిల్లాలో క్షేత్ర సందర్శన కు తీసుకు వెళ్ళి వారికి పూర్తి అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ సాగు చేపట్టాలి అని నిర్ణయించినందున , కంపెనీలు అవసరం ఉన్నంత మేరకు నాణ్యమైన మొక్కలను వారి నర్సరీలలో పెంచి రైతులకు సకాలం లో అంద చేయాలని కోరారు. రైతులకు అవగాహన కల్పించడానికి విత్తనం నుండి ఆయిల్ తీసే విధానం వరకు అన్నీ అంశాలను రైతులకు అర్థమయ్యే విధంగా సుమారు అర గంట నిడివి గల డాక్యుమెంటరీ రూపొందించాలని ఆయిల్ ఫెడ్ ఎండీకి ఆదేశాలు జారీ చేశారు. ఆయిల్ పామ్ విత్తన మొలకలపై దిగుమతి సుంకాన్ని 30 శాతం నుండి 5 శాతానికి తగ్గించినందుకు కేంద్ర ప్రభుత్వానికి మంత్రి ఈ సంద‌ర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆయిల్ పామ్ మొక్కల లభ్యత, నాణ్యత పరిశీలనకు త్వరలోనే నర్సరీల సందర్శిస్తామ‌న్నారు.

 

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like