మిడిమిడి జ్ఞానంతో మాట్లాడ‌కండి

-ఇప్ప‌టి వ‌ర‌కు ప‌దిహేడు వేల ఉద్యోగాలు ఇచ్చారు
-స‌మ్మెలో మీ కార్మిక సంఘం కూడా పాల్గొంది క‌దా..?
-కేసీఆర్‌ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఎన్నో సంక్షేమ ప‌థ‌కాలు
-బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత అన్నీ అమ్ముకుంటున్న‌రు
-నాలుగు బొగ్గు బ్లాక్‌లు సింగ‌రేణికి కేటాయించే ప్ర‌య‌త్నం చేయండి
-తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం శ్రీ‌రాంపూర్ ఏరియా ఉపాధ్య‌క్షుడు సురేంద‌ర్‌రెడ్డి

 

మంచిర్యాల : సింగ‌రేణిపై బీజేపీ నేత‌లు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నార‌ని వారి తీరు మార్చుకోవాల‌ని తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం శ్రీ‌రాంపూర్ ఏరియా ఉపాధ్య‌క్షుడు సురేంద‌ర్‌రెడ్డి దుయ్య‌బ‌ట్టారు. ఆయ‌న ఆదివారం మాట్లాడుతూ కేవ‌లం ఉనికి చాటుకోవ‌డం కోస‌మే అస‌త్యాలు మాట్లాడుతున్నార‌ని అన్నారు. బిజెపి అధ్యక్షుడు ఎర్రబెల్లి రఘునాథ్ రావు మాట్లాడిన మాటలు పూర్తి అస‌త్యాల‌ని చెప్పారు. దీనిని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం తీవ్రంగా ఖండిస్తోందన్నారు.

బీజేపీ అనుబంధ సంఘమైన బి ఎం ఎస్ తో సహా ఐదు జాతీయ సంఘాలు 20 సంవత్సరాల కింద‌ట పోగొట్టిన డిపెండెంట్ ఉద్యోగాలను 2016లో కేసీఆర్ ఇప్పిస్తే ఒక ద్రోహి ద్వారా కోర్టుకు వెళ్లి ఉద్యోగాలపై స్టే తెచ్చార‌ని అన్నారు. మళ్ళీ 2018 లో కారుణ్య నియామకాల పేరుతో ముఖ్యమంత్రి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ తెప్పించి ఇప్పటివరకు పదివేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చార‌న్నారు. ఇంట‌ర్న‌ల్‌, ఎక్స్‌ట‌ర్ష‌న్ ద్వారా ఇప్పటివరకు సింగరేణి బొగ్గు గనుల్లో 17 వేల మంది పైచిలుకు యువకుల తో కళకళలాడుతున్న సింగరేణి మీ కళ్ళకు కనబడటం లేదా…? అని ప్ర‌శ్నించారు.

సింగరేణి లో ఉన్నటువంటి ఈ ఉద్యోగాలను దమ్ముంటే కోల్ ఇండియాలో ఇప్పించాల‌ని స‌వాల్ విసిరారు. కొత్త బావుల ప్రారంభానికి అనుమతుల కోసం లేఖలు రాస్తే వాటి అనుమతులు ఇప్పించ కపోగా సింగరేణికి సంబంధించిన 4 బొగ్గు బ్లాకులను ప్రైవేటు వారికి అప్పచెప్పే ప్రయత్నం మీ పార్టీ చేయడం లేదా అని అన్నారు. సింగరేణి ఉద్యోగస్తులు 72 గంటల పాటు సమ్మె చేయగా అందులో మీ అనుబంధ సంఘమైన బి ఎం ఎస్ కూడా పాల్గొనడం మీ కళ్ళకు కనబడటం లేదా అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు సింగరేణి కార్మికుల సొంత ఇంటి నిర్మాణానికి పది లక్షల రూపాయలకు రుణానికి వడ్డీ తిరిగి ఇప్సిస్తున్న విష‌యం మీకు తెలియదా..? అన్నారు.

భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు చట్టాలను తీసుకొచ్చి కొన్ని వందల మంది రైతు ల మరణానికి కారణమ‌య్యార‌ని చెప్పారు. రైతుల‌ ఉద్యమానికి తలవంచి నల్ల చట్టాలను ఉపసంహరించుకున్నార‌ని అన్నారు. సింగరేణి, రైల్వేస్, ఎయిర్ లైన్స్, ఎల్ఐసి అన్నింటిని ప్రైవేటు వారికి అప్ప‌జెప్పే కుట్ర‌లు జ‌ర‌గుతున్నాయ‌ని దుయ్య‌బ‌ట్టారు. దమ్ముంటే సింగరేణి ప్రాంతానికి చెందిన 4 బొగ్గు బ్లాకులను సింగరేణి ఇవ్వాలని ఆ దిశగా ప్రయత్నం చేయాల‌న్నారు. అంతేకానీ మిడిమిడి జ్ఞానంతో, అవగాహన రాహిత్యంతో మాట్లాడితో ఈ కార్యక్రమంలో ఏరియా వైస్ ప్రెసిడెంట్ సురేంద్ర రెడ్డి , జీయం చర్చల ప్రతినిధులు వెంగల కుమారస్వామి, పెట్టం లక్ష్మణ్,రాజనాల రమేష్,కాశి రావు,బుస రమేష్,దొమ్మేటి పోశెట్టి,రాఘవరెడ్డి,ఏరియా సెక్రటరీ పానుగంటీ సత్తయ్య,ఏరియా నాయకులు జగదీశ్వర్ రెడ్డి, తోoగలు రమేష్,చిలువేరు సదానందం,మైపాల్ రెడ్డి పిట్ సెక్రటరీలు మహేందర్ రెడ్డి,గోపాల్ రెడ్డి,చిలుముల రాజమల్లు,పెంట శ్రీను,మెండ వెంకన్న, శ్రీరాములు, గడ్డంమలయ్య,రత్నాకర్ రెడ్డి, పుప్పల సదానందం,ఏంబడి తిరుపతి,పెగ మల్లేష్,చారి, సత్యనారాయణ నాయకులు నీలం సదయ్య,సమ్మిరెడ్డి,పొగాకు రమేష్,అన్వేష్ రెడ్డి,మైపాల్ రెడ్డి,సుధాకర్ సంతోష్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like