మీ పోరాటం న‌చ్చింది

-నేను కూడా హాస్ట‌ల్‌లో ఉండి చ‌దువుకున్నా
-కొన్ని స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాం.. మ‌రికొన్ని ప‌రిష్క‌రించాల్సి ఉంది
-న‌వంబ‌ర్ లో మ‌ళ్లీ మీ ద‌గ్గ‌ర‌కు వ‌స్తాను
-బాస‌ర ట్రిపుల్ విద్యార్థుల‌తో మంత్రి కేటీఆర్

minister-ktr-with-triple-it-students: ‘మీరు శాంతియుతంగా నాకు ఎంత‌గానో నచ్చింది.. వేరే ఏజెండా లేకుండా ఉద్యమం నడిపిన మీ విద్యార్థులందరికీ అభినందనలు… ప్రజాస్వామ్యబద్దంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది… మీ స‌మ‌స్య‌లు కొన్ని ప‌రిష్క‌రించాం.. మ‌రికొన్ని ప‌రిష్క‌రించాల్సి ఉంది’ – బాస‌ర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల‌తో మంత్రి కేటీఆర్

బాస‌ర ట్రిపుల్ ఐటీలో ఉన్న స‌మ‌స్య‌లు ఒక్కొక్క‌టిగా ప‌రిష్క‌రిస్తామ‌ని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని విద్యార్థులను కోరారు. సోమవారం రాష్ట్ర మంత్రులు క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావు, ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తాను విద్యార్థిగా ఉన్న సమయంలో 70 శాతం జీవితం హాస్టల్స్‌లోనే గడిచిందన్నారు. హాస్టల్ కష్టాలు తనకు కూడా తెలుసని.. పాతుకుపోయిన వ్యవస్థలను మార్చడానికి టైమ్ పడుతుందని అన్నారు. ప్రక్షాళన చేసేందుకు విద్యార్థులు కూడా తమకు కొంత సమయం ఇవ్వాలని కోరారు.

శాంతియుతంగా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు చేసిన పోరాటం తనకు కూడా నచ్చిందని.. అయితే ప్రభుత్వంలో ఉన్న తాను ఈ మాట చెప్పకూడదన్నారు. ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్లడమే తప్ప.. వేరే ఏజెండా లేకుండా ఉద్యమం నడిపిన విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు. ప్రజాస్వామ్యబద్దంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందన్నారు. మెస్‌లలో నాణ్యమైన భోజనం అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొత్త వాటిని కట్టడం తేలికైన పని అని.. అయితే మెయింటనెన్స్ అనేది చాలా పెద్ద చాలెంజ్ అని అన్నారు. విద్యార్థులు కూడా ట్రిపుల్ ఐటీని వారి సొంత ఆస్తిగా భావించాలన్నారు. ప్రతి వస్తువును జాగ్రత్తగా కాపాడుకుని.. తర్వాత వచ్చే విద్యార్థులకు అందించాలని కోరారు. విద్యార్థుల నుంచి కొత్త ఆవిష్కరణలు రావాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ఉద్యోగాల కోసం చూడకుండా.. ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని అన్నారు.

కాలేజీ సమస్య తీవ్రతను గుర్తించి అధికారులను నియమించామని..అతి త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని కేటీఆర్ తెలిపారు. విద్యార్థులు ఇన్నోవేటివ్ గా ఆలోచించి కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని కేటీఆర్ చెప్పారు. పదిమందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని సూచించారు. యూనివర్సిటీలో మినీ టీ హబ్ ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇవాళ తాను వచ్చానని మంచి భోజనం పెట్టారని..నవంబర్ లో మళ్లీ యూనివర్సిటీని సందర్శిస్తామని చెప్పారు. అప్పుడు విద్యార్థుల‌కు ట్యాబ్‌లు ఇస్తామ‌ని హామీ ఇచ్చారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like