ఎమ్మెల్యే చిన్న‌య్య‌కు శిక్ష త‌ప్ప‌దు

-చిన్నయ్య అపర కీచకుడిగా మారారు
-అవినీతి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ దుర్గం చిన్నయ్య
-పనులపై వచ్చే మహిళలను లోబరుచుకుని వేధిస్తున్నాడు
-ఒక సంస్థను అడ్డం పెట్టుకుని రైతులను మోసం చేశాడు
-ఎమ్మెల్యే బాధ్య‌త తీసుకుని రైతుల డ‌బ్బులు ఇప్పించాలి
-BRS పార్టీ ఒక వ్యభిచార సంస్థగా మారింది
-సికాస కార్య‌ద‌ర్శి ప్ర‌భాత్ పేరిట లేఖ విడుద‌ల

Singareni Karmika Samkya : మ‌హిళ‌ల పాలిట అప‌ర‌కీచ‌కుడిగా మారి, రైతుల‌ను మోసం చేసిన బెల్లంప‌ల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య‌కు ప్ర‌జ‌ల చేతిలో శిక్ష త‌ప్ప‌ద‌ని మావోయిస్టు పార్టీ హెచ్చరించింది. సింగ‌రేణి కోల్‌బెల్ట్ క‌మిటీ కార్య‌ద‌ర్శి ప్ర‌భాత్ పేరిట ఓ లేఖ విడుద‌ల చేశారు. ఇందులో ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య‌, ఆయ‌న అనుచ‌రులు పెద్ద ఎత్తున భూ దందాలు, త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చే మ‌హిళ‌ల‌ను లోచ‌రుచుకుని ఇబ్బందుల‌కు గురి చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. చిన్నయ్య అపర కీచకుడిగా మారారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పనులపై తన వద్దకు వచ్చే మహిళలను లోబరుచుకుని వేధిస్తున్నాడని తెలిపారు. అవినీతి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ దుర్గం చిన్నయ్య అంటూ లేఖ‌లో స్ప‌ష్టం చేశారు. విషపు చూపులు, కామ పిచాచి, అవినీతి అక్రమాల కు కేరాఫ్ ఎమ్మెల్యే అంటూ ప్రభాత్ వెల్ల‌డించారు.

కొంతమంది BRS మహిళ శ్రేణులు, ఆ పార్టీ నాయకుల కుటుంబాలకు చెందిన మహిళలను సైతం ప్రలోభపెడుతూ విషపురుగులుగా కాటేస్తున్న దుర్గం చిన్నయ్య త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను ఖండ‌న‌ల‌తో స‌రిపుచ్చుతున్నార‌ని ఖండ‌న‌ల‌తో పాపాలు స‌మ‌సిసోవ‌ని దుయ్య‌బ‌ట్టారు. తన రాజకీయ గురువు చెన్నూరు మాజీ MLA జనార్దన్ ఆశీస్సులతో ప‌లు ప‌ద‌వులు చేప‌ట్టి ప్ర‌జా వ్య‌తిరేక కార్యక్రమాలకు పాల్పడడంతో పార్టీ హెచ్చరికతో మంచిర్యాలకు మకాం మార్చాడ‌ని తెలిపారు. చిన్నయ్య గురువును మించిన శిష్యుడిగా BRS, MLAగా గెలిచి మోసాల‌తో ప్ర‌భుత్వ భూముల‌ను కాజేస్తున్నాడ‌ని అన్నారు. ఆరిజ‌న్ అనే సంస్థ‌ను అడ్డుపెట్టుకుని రైతుల‌ను మోసం చేశాడ‌ని ఆరోపించారు. ప్ర‌భుత్వ అధికారుల‌ను సైతం తన అవినీతి అక్రమాలకు అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని దుయ్య‌బ‌ట్టారు.

ఆరిజ‌న్ వ్య‌వ‌హారంలో రైతుల ఆందోళనలు, ఒత్తిడితో MLA తన త‌ప్పేం లేద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌డం స‌రికాద‌న్నారు. ఆ సంస్థ‌పై కేసులు పెట్టించి త‌న‌కు సంబంధం లేద‌ని న‌మ్మించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌న అనుచ‌రుల‌తో ఖండ‌న‌లు ఇప్పించ‌డం దొంగే.. దొంగ‌.. దొంగ‌.. అని అరిచిన‌ట్లు ఉంద‌న్నారు. BRS పార్టీ ఒక వ్యబిచార సంస్థగా మారింద‌న్నారు. కాంగ్రెస్‌, బీజేపీల కంటే బూర్జూవా పార్టీగా మారింద‌ని దుయ్య‌బ‌ట్టారు. BRS అవినీతి అక్రమాలతో భూకబ్జాలకు పాల్పడుతూ ప్రజలను అణచివేస్తూ ప్రజా ఉద్యమాలపై నిర్బందాన్ని పెంచిద‌న్నారు. రాజ్యహింస ప్రోత్సహిస్తున్న BRS నేత‌లు, దుర్గం చిన్నయ్య లాంటి వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని ప్ర‌భాత్ పిలుపునిచ్చారు.

MLA చిన్నయ్య అనుచరులు సైతం గుండాలు, రౌడీలుగా మారి మహిళలను వేధిస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. గడ్డం భీమగౌడ్, శాన‌ శ్రావణ్, సన్నిబాబు, శ్యాం, బ‌త్తుల‌ సుదర్శన్, కొలి వేణ‌మాదవ్, ప్రకాష్ ఇతర BRS గుండాలు తమ పద్ధతులు మార్చుకొని ప్రజలను క్షమాపణ కోరాలని హెచ్చరిస్తున్నామని సికాస కార్య‌ద‌ర్శి ప్ర‌భాత్ హెచ్చ‌రించారు. మోసపోయిన రైతులకు MLA బాద్యత తీసుకుని డబ్బులు తిరిగి చెల్లించాలని లేనట్లయితే, ప్రజల చేతిలో శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నామన్నారు. సికాస కార్య‌ద‌ర్శి ప్ర‌భాత్ పేరిట విడుద‌లైన ఈ లేఖ నిజ‌మా..? క‌ఆదా కాదా..? అనే విష‌యంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇది మావోయిస్టులే విడుదల చేశారా లేదా వేరే వాళ్లు ఇలా చేశారా అనే పూర్తి స్థాయి వివరాలు సేక‌రిస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like