ఎమ్మెల్యేపై అన‌ర్హ‌త వేటు

MLA disqualified:తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ తీర్పునిచ్చింది. వనమా ఎంపికపై మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు హైకోర్టులో వేసిన పిటిషన్ పై ఈరోజు తుది తీర్పు వచ్చింది. 2019లో వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. 2014 ఎన్నికల సందర్భంగా నామినేషన్ తోపాటు వనమా దాఖలు చేసిన అఫిడవిట్‌ కు.. 2018లో సమర్పించిన అఫిడవిట్‌ తేడా ఉందని ఆయన చేతిలో ఓడిపోయిన జలగం వెంకట్రావు కోర్టులో కేసు వేశారు. ఆస్తులను సరిగా వెల్లడించలేదని కోర్టుమెట్లెక్కారు. 2018 ఎన్నికల్లో రెండవ స్థానంలో నిలిచిన జలగం వెంకటరావును హై కోర్టు ఎమ్మెల్యేగా ప్రకటించింది. ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు వేయ‌డ‌మే కాకుండా, ఆయనకు రూ. 5 లక్షల జరిమానా కూడా విధించింది. జలగం వెంకట్రావును 2018 డిసెంబర్ 12 నుంచి ఎమ్మెల్యేగా పరిగణనలోకి తీసుకోవాలని తెలిపింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like