రైతులు ఆత్మహత్యలు చేసుకొని చావాలి

MLA Durgam Chinnayya: నిత్యం వివాదాలతో స‌హ‌వాసం చేసే బెల్లంప‌ల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య మ‌రోమారు వివాదంలో చిక్కుకున్నారు. ఆయ‌న మ‌రోమారు నోరు జారి చిక్కుల్లో ప‌డ్డారు. బెల్లంపల్లి మండలం బట్వాన్పల్లి గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సభలో రైతుల గురించి మాట్లాడుతూ ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య ఈ దేశంలో అన్నం పెట్టే రైతన్న ఆకలితో చావద్దు ఆత్మహత్యలు చేసుకొని చావాలి అని మాట్లాడారు. దీంతో అవాక్క‌వ‌డం అక్క‌డి నేత‌లు, ప్ర‌జ‌ల వంత‌య్యింది. రైతులను ఆదుకోవాలని ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకు వ‌చ్చార‌ని ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే వెల్ల‌డించారు. అయితే, రైతుల గురించి నోరు జారిన ఎమ్మెల్యే వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like