ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలకు రావాలని సర్క్యులర్

-అధికారులు ఎమ్మెల్యే భ‌జ‌న చేస్తున్నార‌ని ఆగ్ర‌హం
-త‌ప్పు జ‌రిగింద‌ని సారీ చెప్పిన క‌మిష‌న‌ర్‌

ఇటీవల కేటీఆర్ బర్త్ డేకు హాజరుకాని సిబ్బంది కి బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ మెమో జారీ చేయడం వివాదాస్పదమైంది. తాజాగా అలాంటి మరో ఘటన జరిగింది. నర్సంపేట మున్సిపాలిటీ అధికారుల వైఖరి వివాదాస్పదంగా మారింది. నర్సంపేట MLA పెద్ది సుదర్శన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. వార్డు సభ్యులందరూ హాజరుకావాలని ఏకంగా సర్క్యులరే జారీ చేశారు. ఆర్.ఓ.సీ. నెం. సీ1/1676/2022 తో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలకు కౌన్సిల్ సభ్యులంతా హాజరు కావాలని 5వ తేదీన సర్క్యూలర్ జారీ చేశ ఆరు. ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు అధికారికంగా జరపడం కోసం కమిషనర్ ఉత్తర్వులు ఇవ్వడంపై కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భజన చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

పొరపాటు జరిగింది..!
తెలంగాణ జాతి పిత జయశంకర్ సార్ జయంతి బదులు మున్సిపాలిటీ అధికారులు పొరపాటున ఎమ్మెల్యే జన్మ దినానికి హాజరవమని సర్క్యూలర్ జారీ చేసి తప్పు చేసినట్లు అంగీకరించారు. శ‌నివారం నర్సంపేట పురపాలక సంఘం కమిషనర్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. మొదటి స‌ర్క్యుల‌ర్‌లో ఎమ్మెల్యే పుట్టిన రోజు వేడుకలు జరిపేందుకు కౌన్సిల్ సభ్యులు రావాలని కోరార‌ని, ఇక్కడే పొరపాటు జరిగిందని, ప్రొ.జయశంకర్ పేరు రావాల్సి ఉందన్నారు. ఈ క్రమంలో తప్పును సరి చేసి రెండో స‌ర్క్యుల‌ర్ కౌన్సిల్ సభ్యులకు పంపినట్లు మున్సిపాలిటీ కమిషనర్ వెంకటస్వామి తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like