ఎమ్మెల్సీ అభ్య‌ర్థి నామినేష‌న్ రేపు..

కేసీఆర్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయ‌డంతో వారు నామినేష‌న్లు వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కొంత మంది అభ్య‌ర్థులు నేడు నామినేష‌న్ వేస్తుండ‌గా, మ‌రికొంద‌రు రేపు నామినేష‌న్లు వేస్తున్నారు. ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీగా దండే విఠ‌ల్‌ను కేసీఆర్ ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే. దీంతో ఆయ‌న రేపు (మంగ‌ళ‌వారం) నామినేష‌న్ దాఖ‌లు చేయ‌నున్నారు. చ‌వితి మంచి రోజు కావ‌డంతో నామినేష‌న్ వేస్తార‌ని ఆయ‌న అనుచ‌ర వ‌ర్గం స్ప‌ష్టం చేసింది. ఉద‌యం ఆదిలాబాద్ క‌లెక్ట‌రేట్ చేరుకోనుని అక్క‌డ నామినేష‌న్ దాఖ‌లు చేస్తారు.

సోమ‌వారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పట్నం మహేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేస్తారు.
ఉదయం 11 గంటల కు లక్టికాపూల్ లోని కలెక్టర్ కార్యాలయంలో త‌న నామినేష‌న్ ప‌త్రాలు క‌లెక్ట‌ర్ కు అంద‌చేయ‌నున్నారు. ఇక వరంగల్ కలెక్టర్ కార్యాలయంలో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ దాఖ‌లు చేస్తారు. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సాయిచంద్ నామినేషన్ దాఖలు చేస్తారు. ఎల్. ర‌మ‌ణ మాత్రం మంగ‌ళ‌వారం త‌న నామినేష‌న్ కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం లో దాఖ‌లు చేయ‌నున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like