మోదీ నంబ‌ర్ 1

-ఏ మాత్రం తగ్గని మోదీ పాపులారిటీ
-దరిదాపుల్లో లేని మిగతా ప్రపంచ నేతలు
-అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ సర్వే
-78 శాతం రేటింగ్ సాధించిన ప్రధాని మోదీ
-మరింత తగ్గిన అమెరికా అధ్యక్షుడి పాపులారిటీ

Pm Modi: ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన దేశాధినేతల్లో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి టాప్‌లో నిలిచారు. అమెరికాకు చెందిన ‘మార్నింగ్‌ కన్సల్ట్‌’ సంస్థ సర్వేలో మోదీకి 78 శాతం రేటింగ్‌ దక్కింది. అంతకు ముందు సర్వేల్లోనూ ఆయన తొలిస్థానంలోనే ఉన్నారు. ఈసారి కూడా 22 దేశాల నేతలను వెనక్కినెట్టి మోదీ అగ్రస్థానం సాధించడం విశేషం. అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే ఓ సంస్థ.. ప్రపంచ దేశాధి నేతల పాలన, నిర్ణయాలు తదితర అంశాలపై ఏటా సర్వే నిర్వహించి, రేటింగ్ ఇస్తుంది. ఈ ఏడాది కూడా ఆ సంస్థ చేపట్టిన సర్వేలో భారత ప్రధాని మోదీ అగ్రస్థానంలో నిలిచారు.

ఈ సర్వేలో అమెరికా అధ్యక్షుడు కనీసం 50 శాతం ఓట్లను సాధించలేక పోవడం గమనార్హం. తనదైన మార్కు నిర్ణయాలు, అభివృద్ధి, అందర్నీ కలుపుకుని వెళ్లడం, అవినీతి రహిత పాలన వంటి అంశాలే మోదీ ప్రజాదరణను పెంచాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ సర్వేలో తర్వాతి స్థానాల్లో స్విట్జర్లాండ్‌ అధ్యక్షుడు అలెన్‌ బెర్సెట్‌, మెక్సికో అధ్యక్షుడు ఆండ్రిస్‌ మాన్యుయెల్‌ లోపెజ్‌ ఒబ్రాడోర్‌, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని అల్బనీస్‌, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఉన్నారు. ఈ సర్వేలో అమెరికా అధ్యక్షుడు పాపులారిటీ 50 శాతం కంటే తక్కువ ఉండటం గమనార్హం. జో బైడెన్‌ (41 శాతం), కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో (39 శాతం), జర్మనీ చాన్సలర్‌ ఓలాఫ్‌ స్కోల్జ్‌ (34 శాతం), బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ (33 శాతం) తర్వాతి స్థానాల్లో నిలిచారు.

టాప్ హెల్త్ జర్నల్స్‌లో ఒకటిగా పరిగణించే లాన్సెట్ ఆయుష్మాన్ భారత్‌ను ప్రశంసించింది. ఈ పథకం దేశంలోని ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిందని పేర్కొంది. కాగా, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ ఇప్పటికీ హాట్ ఫేవరెట్‌గా ఉందని తెలిపింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like