మోదీ నంబ‌ర్ 1

అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన నేత‌గా తొలి స్థానం - గ్లోబ‌ల్ లీడ‌ర్ అప్రూవ‌ల్ ట్రాక‌ర్ స‌ర్వేలో వెల్ల‌డి

ప్రపంచ వ్యాప్తంగా భారత ప్రధాని నరేంద్ర మోడీకి మరింత క్రేజ్ పెరిగింది. ఎక్కువగా ఇష్టపడే నాయకుల్లో మోదీ ముందు వరుసలో ఉన్నారు. 70 శాతం మంది ఆమోదంతో మిగతా దేశాల నేతలతో సరి చూసుకుంటే ప్రధాని మోడీ టాప్‌ జాబితాలో ఉన్నారు. ఆ తర్వాత స్థానాల్లో మిగతా దేశాల నేతలు ఉన్నారు. ఈ లిస్ట్‌లో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, కెనడా ప్రధాని ట్రూడో, యూకే ప్రధాని బోరిస్ జాన్సన్, బ్రెజిల్ ప్రెసిడెంట్ జైర్ బోల్సోనారో తదితరులు ఉన్నారు. ప్రధాని నరేంద్రమోడీ 70 శాతం ఆమోదంతో మరోసారి గ్లోబల్ లీడర్‌లలో అగ్రస్థానంలో నిలిచారని పియూష్ గోయల్ పేర్కొన్నారు. ప్రధాని మోడీ 13 మంది ప్రపంచ నేతల కంటే ముందుగా ఉన్నారని సర్వే ద్వారా తేలింది. ఇటాలియన్ ప్రధాని మారియో డ్రాగి, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రడార్, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ల కంటే ప్రధాని మోడీ ముందున్నట్లు సర్వేలో తేలింది.

సర్వేలో వెల్లడైన నేతల పేర్లు:

1. నరేంద్ర మోదీ: 70 శాతం
2. లోప్ ఒబ్రాడర్: 66 శాతం
3. మారియో డ్రాగి: 58 శాతం
4. ఏంజెలా మెర్కెల్: 54 శాతం
5. స్కాట్ మోరిసన్: 47 శాతం
6. జస్టిన్ ట్రూడో: 45 శాతం
7. జో బిడెన్: 44 శాతం
8. ఫ్యూమియో కిషిడా: 42 శాతం
9. మూన్ జే-ఇన్: 41 శాతం
10. బోరిస్ జాన్సన్: 40 శాతం
11. పెడ్రో శాంచెజ్: 37 శాతం
12. ఇమ్మాన్యుయేల్ మాక్రాన్: 36 శాతం
13. జైర్ బోల్సోనారో: 35 శాతం

Get real time updates directly on you device, subscribe now.

You might also like