మోదీ విజ‌యాలు… కేసీఆర్ వైఫ‌ల్యాలు..

గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ బీజేపీ

మంచిర్యాల : ఎనిమిది సంవ‌త్స‌రాల్లో మోదీ పేద ప్ర‌జ‌ల కోసం ఎన్నో సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేశార‌ని భార‌తీయ జ‌న‌తా పార్టీ తాండూరు మండ‌ల అధ్య‌క్షుడు రామ‌గోని మ‌హీధ‌ర్ గౌడ్ అన్నారు. మోదీ ప్రభుత్వం 8 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా తాండూరు మండలం మాదారం టౌన్షిప్ లో ప్ర‌జ‌ల్లోకి బీజేపీ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ మోదీ పాల‌న‌ల‌తో భార‌త‌దేశం ప్ర‌పంచ దేశాల్లో గ‌ర్వంగా త‌లెత్తుకుని నిల‌బ‌డింద‌న్నారు. మోడీ ప్రభుత్వం 80 కోట్ల మంది ప్రజలకు గరీబ్ కళ్యాణ యోజన పథకం ద్వారా ఉచిత ఆహార ధాన్యాలు అందించారని చెప్పారు. పీఎం ఆవాస్ యోజన కింద అర్బన్లో 1.22 కోట్ల ఇళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో 2.3 కోట్ల ఇళ్లు మంజూరయ్యాయని వెల్ల‌డించారు స్వచ్ఛ భారత్ మిషన్ కింద 11.22 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం జరిగాయని, ఆయుష్మాన్ భారత్ కింద 3.2 కోట్ల మందికి 5 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని పొందార‌ని స్ప‌ష్టం చేశారు. 18 కోట్లకు పైగా ఆయుష్మాన్ భారత్ కార్డు జారీ అయ్యాయని వెల్ల‌డించారు. ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజ్ నిర్మాణం, ప్రతి డిఏపి ఎరువుల బ్యాగు మీద పన్నెండు వందల రూపాయలు సబ్సిడీ అందజేస్తున్న విష‌యాన్ని గుర్తు చేశారు. నరేంద్ర మోడీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఎనిమిది సంవత్సరాల్లో సాధించిన ఘన విజయాలు, టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు అమలు కాని హామీలను కరపత్రాలు పంచుతూ ప్రజలకు వివరించారు. కార్య‌క్ర‌మంలో శక్తి కేంద్ర ఇన్‌ఛార్జీలు మండల ఉపాధ్యక్షుడు పుట్ట కుమార్, బీజేవైఎం మండల అధ్యక్షుడు రాహుల్‌, శ్రీనివాస్, కుమార్ మండల ఉపాధ్యక్షులు కోమల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి భరత్ కుమార్, నాయకులు సంతోష్, నాగరాజు, కార్తీక్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like