మూడో క‌న్ను తెరుచుకుంది..

క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ ప్రారంభించిన కేసీఆర్‌

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన పోలీస్‌ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (command control center) ముఖ్య‌మంత్రి కేసీఆర్ గురువారం ప్రారంభించారు. ముఖ్యమంత్రి టవర్ ‘ఏ’ లోని 18వ ఫ్లోర్‌లో సీపీ సీవీ ఆనంద్ ప్రారంభించారు. అనంతరం లాంఛనంగా తన ఛాంబర్‌లో సీపీ బాధ్యతలు స్వీకరించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఆయా మత పెద్దలతో సర్వ మత ప్రార్థనలు నిర్వహించారు.

కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో వివిధ విభాగాలను సీఎం సందర్శించారు. టవర్ Dలో తెలంగాణ పోలీస్ చరిత్రను తెలిపేలా మ్యూజియం ఏర్పాటు చేశారు. మొదటి కొత్వాల్ రాజబహుదూర్ కాలం నుండి పోలీస్ వ్యవస్థ ఎలా ప‌ని చేస్తుందో తెలిపేలా మ్యూజియం నిర్మించారు. అలనాటి పోలీస్ వ్యవస్థను తెలిపే ఫొటోల‌ను ప్రదర్శించారు.

అత్యాధునిక సాంకేతికతతో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను నిర్మించారు. దీని ఏర్పాటుతో నగర కమిషనరేట్ పరిధిలోని శాంతిభద్రతలు, సీసీఎస్, టాస్క్ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్ .. ఇలా అన్ని విభాగాలన్నీ ఒకే గొడుగు కిందికి చేరాయి. వీటిలో ఏ విభాగానికి సంబంధించిన పని కోసమైనా ప్రజలు వివిధ ప్రాంతాలకు తిరగాల్సిన అవసరం లేకుండా సింగిల్ విండో విధానం అమలు కానుంది. కమాండ్ , కంట్రోల్ సెంటర్ లో విపత్కర, అత్యవసర పరిస్థితుల్లో అని డిపార్ట్ మెంట్ల చీఫ్ లు ఒకే దగ్గర సమావేశమై నిర్ణయాలు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో కార్పొరేట్ స్థాయి సేవలు అందుబాటులోకి వస్తాయి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like